Mahesh Babu: హీరోలు ఎంతమందైనా ఉండచ్చు కానీ స్టార్ హీరోలు కొందరే ఉంటారు. అందులో మహేష్ బాబు ఒకరు. సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగి తండ్రికి తగ్గ తనయుడిగా గుర్తింపును సంపాదించుకున్నాడు. ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో ‘వారణాసి’ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీతో పాన్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నాడు. ఈ సినిమా మీద ప్రేక్షకులందరిలో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. ఇక ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసిన కూడా రామటుబంటి గుర్తింపును రాజమౌళి సినిమాతో మహేష్ బాబు అందుకోబోతున్నాడనేది వాస్తవం… ఇక మహేష్ బాబు తన కెరియర్ లో చాలా సూపర్ హిట్ సినిమాలను వదిలేశాడు.
తను వదిలేసుకున్న సినిమాలతో మరికొంతమంది హీరోలు సూపర్ సక్సెస్ లను సాధించారు. ఆయన వదిలేసుకున్న సినిమాల్లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘గోదావరి’ సినిమా ఒకటి… ఈ సినిమాని సుమంత్ చేసి సూపర్ సక్సెస్ ని అందుకున్నాడు… శేఖర్ కమ్ముల డైరెక్షన్లో వచ్చిన ‘ఫిదా’ సినిమాని సైతం మహేష్ బాబు రిజెక్ట్ చేశాడు.
దాంతో వరుణ్ తేజ్ కి సూపర్ సక్సెస్ వరించింది. ఇక వీటితో పాటుగా మరికొన్ని సినిమాలను కూడా ఆయన వదిలేసుకున్నాడు… నితిన్ హీరోగా వచ్చిన ‘ఇష్క్’ సినిమాని సైతం మొదట మహేష్ బాబుకి వినిపించారట. కానీ మహేష్ బాబు ఇమేజ్ కి తగ్గ కథ కాకపోవడంతో ఆయన ఆ సినిమాని రిజెక్ట్ చేసినట్టుగా గతంలో ఒక సందర్భంలో తెలియజేశాడు.
మొత్తానికైతే మహేష్ బాబు రిజెక్ట్ చేసిన సినిమాలతో యంగ్ హీరోలు సూపర్ సక్సెస్ లను సాధించి స్టార్ హీరోలుగా మారే దిశగా ముందుకు దూసుకెళ్తున్నారు…ఇక మహేష్ బాబు రాజమౌళి తో చేస్తున్న సినిమాతో ఇండస్ట్రీ రికార్డ్ లను బ్రేక్ చేస్తాడనేది వాస్తవం…కానీ ఆ తర్వాత చేయబోయే సినిమా తనకి చాలా ఇంపార్టెంట్ గా మారబోతోంది… దాంతో సక్సెస్ సాధిస్తేనే ఆయన మరోసారి టాప్ లెవల్ కి వెళ్తాడు…