Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ తెలుగు 7 మరో వారంలో ప్రారంభం కానుండగా… మైండ్ బ్లోయింగ్ డిటైల్స్ బయటకు వస్తున్నాయి. ఈసారి ఒకటికి రెండు హౌస్లు ఉండనున్నాయని సమాచారం అందుతుంది. బిగ్ బాస్ తెలుగు 6 ఆశించిన స్థాయిలో విజయం కాలేదు. దారుణమైన టీఆర్పీ రాబట్టింది. నాగార్జున హోస్టింగ్ తో పాటు, కంటెస్టెంట్స్ ఆట తీరు నచ్చలేదు. కనీసం ఫైనల్ కూడా మెప్పించలేకపోయింది. అవే గేమ్స్, టాస్క్స్ కిక్ ఇవ్వలేకపోయాయి. నాగార్జున హోస్టింగ్, ఎలిమినేషన్స్ విమర్శల పాలయ్యాయి. అసలు నెక్స్ట్ సీజన్ కి నాగార్జున కష్టమే అంటూ ప్రచారం జరిగింది. కానీ మరో ప్రత్యామ్నాయం లేకపోవడంతో నాగార్జుననే మేకర్స్ కొనసాగిస్తున్నారు.
బిగ్ బాస్ 7ని సక్సెస్ చేసి తమ ప్రాంచైజీని నిలబెట్టుకోవాలని స్టార్ మా ప్రయత్నం చేస్తుంది. ఈ సీజన్ కూడా విఫలమైతే తెలుగు ఆడియన్స్ కి బిగ్ బాస్ షో మీద ఆసక్తిపోతుంది. కాబట్టి ఎలాగైనా ఆడియన్స్ ని ఆకట్టుకోవాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అదిరిపోయే కంటెంట్ సిద్ధం చేస్తున్నారని సమాచారం. గేమ్స్, టాస్క్స్ తో పాటు ఏకంగా షో ఫార్మాట్ మార్చేశారనే సమాచారం అందుతుంది.
ఈసారి ఒకటికి రెండు హౌస్లు ఉంటాయట. అంటే షో ఒకటే కానీ రెండు హౌస్లు ఏర్పాటు చేస్తారట. మొత్తం 20 మంది కంటెస్టెంట్స్ ని ఈ రెండు ఇళ్లలోకి 10 మంది చొప్పున పంపిస్తారట. ఇక షోలో టాస్క్స్, గేమ్స్ ఆధారంగా, కంటెస్టెంట్స్ ప్రవర్తన, ఆట తీరును బట్టి ఇళ్ళు మారుతూ ఉంటారట. అంటే ఒక్కో కంటెస్టెంట్ రెండు రకాల హౌస్ మేట్స్, వాతావరణం చూడాల్సి ఉంటుంది. ఇక చివరి వారాల్లో మొత్తం ఒక హౌస్ గా మార్చేస్తారట.
ఇటీవల బిగ్ బాస్ తమిళ్ ప్రోమో విడుదల కాగా ఈ విషయాన్ని హోస్ట్ కమల్ హాసన్ స్వయంగా చెప్పారు. తమిళ్, తెలుగు బిగ్ బాస్ షోలు ఒకేసారి మొదలయ్యాయి. దాదాపు ఒకే ఫార్మాట్లో సాగుతాయి. తమిళ బిగ్ బాస్ సీజన్ 7 గురించి కమల్ హాసన్ చెప్పిన విషయాలు తెలుగుకు కూడా వర్తిస్తాయి. కాబట్టి ఈసారి బిగ్ బాస్ షోలో రెండు హౌసులు ఉండనున్నాయి.