Heroes Rejected Sandeep Reddy Vanga: అర్జున్ రెడ్డి’ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో పెను రికార్డును సృష్టించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ… ప్రస్తుతం ఉన్న రోజుల్లో ఒక సినిమా సక్సెస్ టాక్ తెచ్చుకోవడం చాలా కష్టం అవుతుంటే, సందీప్ రెడ్డి వంగ మాత్రం అర్జున్ రెడ్డి సినిమాని సూపర్ సక్సెస్ గా నిలిపాడు. 1990 వ సంవత్సరంలో వచ్చిన ‘శివ’ సినిమా తర్వాత అంతటి ఇంపాక్ట్ ను క్రియేట్ చేసిన సినిమాగా అర్జున్ రెడ్డి సినిమా నిలవడం నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. ఇక ఈ సినిమాలో విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి పాత్రలో పర్ఫెక్ట్ గా ఒదిగిపోయి నటించాడు. ఈ మూవీని విజయతీరాలకు చేర్చాడు… ఇక విజయ్ కంటే ముందే ఈ సినిమా చాలామంది హీరోల దగ్గరికి వెళ్లిన విషయం మనకు తెలిసిందే. ఒక ఇద్దరు హీరోలు మాత్రం ఈ సినిమాని కొన్ని కారణాలు చెప్పి రిజెక్ట్ చేసినట్టుగా తెలుస్తోంది.
అందులో శర్వానంద్ ఒకరైతే, మరొకరు మంచు మనోజ్ కావడం విశేషం… వీళ్ళిద్దరు ఈ సినిమాలో కొంచెం అడల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉందనే ఉద్దేశ్యంతోనే కథని రిజెక్ట్ చేశారట. వీళ్ళతోపాటు సందీప్ రెడ్డి వంగ మరో యంగ్ హీరో అయిన సందీప్ కిషన్ కి కూడా ఈ కథను వినిపించారట.
తనకు బోల్డ్ సీన్స్ బాగా నచ్చినప్పటికి తెలుగులో ఈ సినిమా వర్కౌట్ కాదని కావాలంటే దీనిని బాలీవుడ్ లో తీసి తెలుగులోకి డబ్ చేద్దామని సందీప్ కిషన్ చెప్పారట. అయినప్పటికి సందీప్ వంగ మాత్రం ఆయన మాటలు అసలు వినలేదు… మొత్తానికి విజయ్ దేవరకొండ తో ఈ సినిమాను చేసి సూపర్ సక్సెస్ గా నిలిపాడు.
ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో సందీప్ రెడ్డి వంగ అనే బ్రాండ్ ను క్రియేట్ చేసుకున్నాడు. రన్బీర్ కపూర్ ను హీరోగా పెట్టి చేసిన అనిమల్ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించింది… బాలీవుడ్ మాఫియాను సైతం షేక్ చేశాడు. ఇక ఇప్పుడు ప్రభాస్ తో స్పిరిట్ అనే సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా వచ్చే నెల నుంచి సెట్స్ మీదకి వెళ్లే అవకాశాలైతే ఉన్నాయి. తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో కూడా పాన్ వరల్డ్ లో భారీ రికార్డులను క్రియేట్ చేస్తాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది…