Good News for Prabhas Fans: రాధే శ్యామ్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ ఫ్లాప్ అవ్వడం తో ప్రభాస్ అభిమానులు చాలా తీవ్రమైన నిరాశకి గురి అయిన సంగతి మన అందరికి తెలిసిందే..అభిమానులందరూ కూడా ప్రభాస్ హీరో గా నటిస్తున్న సలార్ మరియు ఆది పురుష్ అప్డేట్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు..కానీ ఆ రెండు సినిమాల టీమ్స్ నుండి ఎలాంటి సమాచారం లేకపోవడం తో ప్రభాస్ అభిమానులు మరింత నిరాశకి గురి అయ్యారు..అయితే అలాంటి అభిమానుల కోసం ఇప్పుడు వరుసగా రెండు శుభ వార్తలు ప్రభాస్ అభిమానులకు ఊపీరి పీల్చుకునే చేస్తున్నాయి..ఇటీవలే సలార్ సినిమా దర్శకుడు ప్రశాంత్ నీల్ పుట్టిన రోజు సందర్భంగా ఒక్క సలార్ వర్కింగ్ స్టిల్ ని విడుదల చేసిన ఆ మూవీ టీం..ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చెయ్యబోతున్నారు అట..ఇక అదే రోజు ప్రభాస్ శ్రీ రాముని పాత్రలో నటిస్తున్న ఆది పురుష్ చిత్రం ట్రైలర్ కూడా విడుదల అవ్వబోతుంది అట..అలా ఒక్కే రోజు ప్రభాస్ పుట్టిన రోజు తో పాటుగా మరో రెండు పండగలు జరపుకోబోతున్నారు ఫాన్స్.

Also Read: Secunderabad Gang Rape: ‘రేప్’ల రాజధాని: హైదరాబాద్ లో మరో బాలికపై ఐదుగురి గ్యాంగ్ రేప్
ఇవి రెండు వచ్చే ముందే ఆదిపురుష్ కి సంబంధించిన టీజర్ ని ఆగష్టు 15 వ తారీఖున విడుదల చెయ్యడానికి ఆ చిత్ర బృందం సన్నాహాలు చేస్తుంది అట..త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు బయటకి రాబోతున్నాయి..అంతే కాకుండా వచ్చే నెలలో ప్రభాస్ హీరో గా నటిస్తున్న మరో సినిమా ప్రాజెక్ట్ K కి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చెయ్యబోతున్నారు అట..మహానటి దర్శకుడు నాగ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాని పాన్ వరల్డ్ గా విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు..ఈ సినిమాలో దీపికా పడుకొనే హీరోయిన్ గా నటిస్తుండగా..అమితాబ్ బచ్చన్ ఒక్క ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు..ఇక సలార్ సినిమా విషయానికి వస్తే ఇప్పటికే 35 శాతం కి పైగా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకున్న ఈ సినిమా, ఈ ఏడాది లోపు షూటింగ్ పనులు అన్ని ముగించుకొని వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా విడుదల అవ్వడానికి సిద్ధంగా ఉన్నది..KGF సిరీస్ తర్వాత ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సినిమా కావడం తో..ఈ మూవీ పై అభిమానుల్లో భారీ స్థాయి అంచనాలు ఉన్నాయి.
Also Read: Trivikram- Pooja Hegde: త్రివిక్రమ్ శ్రీనివాస్ పై పూజ హెగ్డే ఆగ్రహం..? కారణం అదేనా??



[…] Also Read: Good News for Prabhas Fans: ఒక్కేసారి రెండు శుభ వార్తల… […]