Sai Pallavi: తెలుగులో అడుగుపెట్టిన మలయాళ బ్యూటీలెందరో మంచి పేరు తెచ్చుకున్నారు. వారిలో ప్రస్తుతం టాప్ స్టార్ గా కొనసాగుతున్న భామ సాయి పల్లవి. శేఖర్ కమ్ముల పరిచయం చేసిన సాయి పల్లవి ఆ తరువాత తెలుగులో చాలా సినిమాలు చేసింది. కానీ కొన్ని మాత్రం బంపర్ హిట్టు కొట్టాయి. తాజాగా ఆమె నటించిన విరాట పర్వం మూవీ రిలీజ్ కు రెడీ అవుతోంది. రానాతో జోడి కట్టిన ఈ బ్యూటీ ఇటీవల కర్నూల్ జిల్లాలో జరిగిన సినీ ఫంక్షన్ కు హాజరైంది. అయితే సాయి పల్లవికి ఉన్న ఫ్యాన్స్ మానియా చెప్పతరం కాదు. ఆమెకు సోషల్ మీడియాలో విపరీతఫాలోయింగ్ ఉంది. ఆ విషయం ఇక్కడ లైవ్ లో అర్థమైంది.

విరాట పర్వం ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని కర్నూల్ లో అరేంజ్ చేశారు. అయితే ఈ ఫంక్షన్ కు వెదర్ అనుకూలించలేదు. గాలి దుమారంతో పాటు జోరు వర్షం కురిసింది. అయినా అభిమానుల ఉత్సాహాన్ని నీరుగార్చకుండా స్టేజీపైకి వచ్చి మాట్లాడింది. అయతే సాయి పల్లవి మాటలు ఎవరికీ వినిపించలేదు. ఎందుకంటే ఆమెను చూడగానే ఫ్యాన్స్ లో ఎనలేని ఉత్సాహం. ఈలలు, గోలలతో అభిమానులు సందడి చేశారు. దీంతో సాయిపల్లవి సైతం మైకులు మార్చుతూ మాట్లాడారు. అయినా వినిపించకపోవడంతో వారి ఉత్సాహాన్ని ఎంజాయ్ చేశారు.
Also Read: Good News for Prabhas Fans: ఒక్కేసారి రెండు శుభ వార్తలు.. ప్రభాస్ ఫాన్స్ కి ఇక పండగే
ఒక హీరోయిన్ కోసం ఇంతగా అభిమానులు రావడంపై ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అంతేకాకుండా అభిమానులు వర్షంలో తడుస్తూ సాయిపల్లవి స్పీచ్ ను విన్నారు. అటు టాలీవుడ్ స్టార్ హీరో రానా సాయి పల్లవికి గొడుగు పట్టడంపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది. జోరు వాన కురుస్తున్నా తనతో పాటు సాయి పల్లవి వర్షంలో తడవకుండా ఒకే గొడుగుపై ఇద్దరు నిల్చోవడం అభిమానులను ఉత్సాహ పరిచింది.

వేణు ఉడుగుల డైరెక్షన్లో వస్తున్న విరాట పర్వం ఈనెల 17న థియేటర్లోకి రానుంది. ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా పలు కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. ఇందులో భాగంగా ఆదివారం కర్నూల్ లో ట్రైలర్ ను రిలీజ్ చేశారు. పూర్తిగా నక్సలైట్ బ్యాక్రౌండ్ తో వస్తున్న ఇందులో రానా , సాయిపల్లవి ఇద్దరు నక్సలైట్ పాత్రలో కనిపించనున్నారు.
Also Read:Nagarjuna Quitting Bigg Boss: బిగ్ బాస్ కు నాగార్జున గుడ్ బై.. కారణం అదే?
వీడియో ఇదీ..
[…] […]