Bigg Boss 9 Telugu: కోట్లాది మంది ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూసిన బిగ్ బాస్ సీజన్ 9(Bigg Boss 9 Telugu) రేపు స్టార్ మా ఛానల్ లో గ్రాండ్ గా ప్రారంభం కానుంది. ప్రతీ సీజన్ మొదలయ్యే ముందు కంటెస్టెంట్స్ జాబితా బయటకు వచ్చినట్టుగా, ఈ సీజన్ మొదలయ్యే ముందు కూడా కంటెస్టెంట్స్ జాబితా బయటకు వచ్చేసింది. అగ్నిపరీక్ష షో ద్వారా హౌస్ లోకి అడుగుపెట్టే కంటెస్టెంట్స్ లిస్ట్ ని కాసేపు పక్కన పెడితే, సెలబ్రిటీల లిస్ట్ ని ఒకసారి చూద్దాం. జబర్దస్త్ ఇమ్మానుయేల్, తనూజ గౌడ, రీతూ చౌదరి, శ్రేష్టి వర్మ, భరణి శంకర్, రాము రాథోడ్, సంజన గల్రాని, ఆశా షైనీ, సుమన్ శెట్టి. మొత్తం మీద పది మంది సెలబ్రిటీలు కంటెస్టెంట్స్ గా హౌస్ లోపలకు అడుగుపెట్టాలి. కానీ కేవలం 9 మంది పేర్లు మాత్రమే బయటకు వచ్చాయి. ఆ పదవ కంటెస్టెంట్ ఎవరు అనేది రేపటి వరకు సస్పెన్స్.
ఇదంతా పక్కన పెడితే రేపు టెలికాస్ట్ అవ్వబోయే గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ లో సీజన్ 7 నుండి ఇద్దరు కంటెస్టెంట్స్, అదే విధంగా సీజన్ 8 నుండి ఒక్క కంటెస్టెంట్ హౌస్ లోపలకు వెళ్ళబోతున్నారు. వాళ్ళు ఎవరంటే అమర్ దీప్, విష్ణు ప్రియ మరియు ప్రియాంక జైన్. గత సీజన్ లాగానే ఈ సీజన్ లో కూడా పాత కంటెస్టెంట్స్ ని తీసుకొచ్చారా?, ప్రతీ వారం వీళ్ళ ముఖాలను టీవీ లో చూస్తూనే ఉన్నాం, మళ్లీ వెళ్లేందుకు బాబోయ్ అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు. కానీ వీళ్ళు హౌస్ లోకి కంటెస్టెంట్స్ గా మాత్రం అడుగుపెట్టడం లేదు, వీళ్ళ చేత బిగ్ బాస్ 9 హోమ్ టూర్ ని ప్లాన్ చేశారట. అంటే హౌస్ లోపలకు వెళ్లి, ఏమేమి ఉన్నాయో జనాలకు చూపించే పని మాత్రమే వీళ్లది.
గత సీజన్ లో లాగా ఈ సీజన్ లో పాత కంటెస్టెంట్స్ ని హౌస్ లోకి తీసుకెళ్లే ప్రక్రియ ప్రస్తుతానికి అయితే లేదట. కానీ గత సీజన్ పాత కంటెస్టెంట్స్ వల్లే పైకి లేచింది. ఎప్పుడైతే గౌతమ్ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టాడో, రెండు గ్రూపులుగా విడిపోయి గొడవ పడే స్కోప్ దొరికింది. బోలెడంత కంటెంట్ వచ్చింది. ఇక అవినాష్, రోహిణి, టేస్టీ తేజా వంటి వారు ఆడియన్స్ కి బోలెడంత ఎంటర్టైన్మెంట్ ని పంచారు. ఆ ఎంటర్టైన్మెంట్ గత సీజన్ ని కాపాడింది. అలా పాత సీజన్ కంటెస్టెంట్స్ చాలా విలువగా నిలిచారు. అలా సీజన్ ఒకవేళ బోరు కొడితే మాత్రం నాలుగు వారాల తర్వాత వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా పాత కంటెస్టెంట్స్ హౌస్ లోపలకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు బిగ్ బాస్ టీం. మరి ఇది జరుగుతుందా లేదా అనేది చూడాలి.