Baaghi 4 Movie Review: బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ నుంచి ఎన్ని సినిమాలు వచ్చిన కూడా ప్రేక్షకులు ఆశించిన మేరకు విజయాలను అయితే అందించలేకపోతున్నాయి. కారణం ఏదైనా కూడా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న హీరోలందరు ఇప్పుడు వెనుకబడిపోతున్నారనే చెప్పాలి. మరి ఇలాంటి సందర్భంలోనే ‘టైగర్స్ ష్రాఫ్’ ‘బాగీ 4’ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఆయన చేసిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా? లేదా అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
కథ
ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే రోని ఒక యాక్సిడెంట్ కి గురై మానసికంగా కొంతవరకు ఇబ్బంది పడుతూ ఉంటాడు. మరి ఇలాంటి సందర్భంలోనే తన లవర్ అయిన అలీషా (హరానాజ్ కౌర్) జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇక ఇలాంటి సందర్భంలోనే అలీషా బ్రదర్ అయిన జీతూ(శ్రేయాస్ తల్పడే) అలీషా అనేది రియల్ గా లేదని అది జస్ట్ రోని ఇల్యూజినేషన్ మాత్రమే అంటూ తెలియజేస్తాడు. మరి ఇలాంటి క్రమంలోనే జీతూ హెంచ్ మెన్ అనే ఒక గ్యాంగ్ స్టర్ ను చంపేస్తాడు…ఆ గ్యాంగ్ స్టర్ కి రోని కి మధ్య సంబంధం ఏంటి? ఆ గ్యాంగ్ స్టర్ ని జితూ చంపేయడానికి గల కారణం ఏంటి అనే విషయాలు తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…
విశ్లేషణ
ఇక విశ్లేషణ విషయానికి వస్తే దర్శకుడు ఏ హర్ష ఈ సినిమాని మొదటి నుంచి చివరి వరకు ఎంగేజింగ్ గా తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేశాడు. కానీ మధ్యలో కొన్ని ఇల్యూజినేషన్ కి సంబంధించిన సీన్స్ రావడం అనేది ప్రేక్షకుడికి కొంతవరకు ఇబ్బంది కలిగించే ప్రయత్నం అయితే చేశాయి…గ్యాంగ్ స్టర్ నేపథ్యంలోనే ఈ సినిమాను పూర్తిగా తెరకెక్కించి ఉంటే బాగుండేది. అలా కాకుండా ఇల్యూజినేషన్ అనే ఒక పాయింట్ ను పెట్టి సినిమాని అటు ఇటు కాకుండా చేశారంటూ సగటు ప్రేక్షకుడు సైతం ఈ సినిమా మీద ఆవేదనను వ్యక్తం చేస్తున్నాడు…
ఇక ఈ సినిమాలో ఎమోషన్ కూడా చాలావరకు మిస్సయింది. ప్రేక్షకుడిని హుక్ చేసే ఎమోషన్ ఎలిమెంట్స్ లేకపోవడం సినిమాకి భారీగా మైనస్ అయితే అయింది… ఫస్టాఫ్ లో వచ్చే సన్నివేశాలను చూస్తున్న ప్రతి ప్రేక్షకులు సైతం ఎందుకు ఈ సన్నివేశాలు వస్తున్నాయి అనే ఒక ఇరిటేషన్ అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక సెకండ్ హాఫ్ లో వచ్చే ఎమోషన్ కి ప్రేక్షకులకు అసలు కనెక్ట్ అవ్వకపోవడం కూడా చాలా వరకు మైనస్ గా మారింది. అలాగే ఈ సినిమాలోని స్టోరీ మీద ఇంకాస్త ఫోకస్ చేసి ఉంటే సినిమా అవుట్ ఫుట్ అనేది ఇంకాస్త బెటర్ గా వచ్చిండేది అని ప్రతి ఒక్క ప్రేక్షకుడు అభిప్రాయపడుతున్నాడు…ఇక మ్యూజిక్ సైతం అంత పెద్దగా ప్లస్ అవ్వలేకపోయింది…
ఆర్టిస్టుల పర్ఫామెన్స్
ఇక ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే ఈ సినిమాతో టైగర్ ష్రాఫ్ ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చేసే ప్రయత్నం చేశాడు. అయినప్పటికీ ఆయన యాక్టింగ్ బాగున్నప్పటికి సినిమాలోనే చాలా కన్ఫ్యూజన్స్ ఉండటం వల్ల ఆయన చేస్తున్న యాక్టింగ్ కూడా ప్రేక్షకులకు పెద్దగా నచ్చలేదు… సంజయ్ దత్ కూడా ఓకే అనిపించేలా నటించాడు. ఆయన చేసిన క్యారెక్టర్ ని ప్రేక్షకులు ఓన్ చేసుకోలేకపోయారు.
అందువల్ల అతను చేసిన పాత్ర కూడా ప్రేక్షకుల్లో పెద్దగా ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేకపోయింది. సినిమాకి కథ చాలావరకు మైనస్ అయింది. దర్శకుడు స్క్రీన్ మీద ప్రజెంట్ చేసినప్పుడు కూడా అది ఎక్కువ మైనస్ అవ్వడం వల్ల యాక్టింగ్ కూడా ప్రేక్షకులకు పెద్దగా ఎక్కలేదు…ఇక హరినాజ్ కౌర్ కూడా ఒకే అనిపించారు…సోనమ్ బజ్వా పర్లేదు అనిపించింది…
టెక్నికల్ అంశాలు…
ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే మ్యూజిక్ అంత పెద్దగా మెప్పించలేదు. బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో కూడా ఇంకాస్త జాగ్రత్తలు తీసుకొని ఉంటే బాగుండేది. విజువల్స్ పరంగా సినిమా ఓకే అనిపించినప్పటికి అవి సినిమా ఎమోషన్ కి ఏ మాత్రం కనెక్ట్ అవ్వకపోవడంతో విజువల్స్ చూస్తున్నంత సేపు ప్రేక్షకుడికి ఒకే అనిపించిన కూడా పెద్దగా ఎగ్జైట్ అవ్వలేకపోతున్నాడు… ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నంతలో ఓకే అనిపించాయి…
ప్లస్ పాయింట్స్
విజువల్స్
కొన్ని యాక్షన్ సీన్స్
మైనస్ పాయింట్స్
కథ
డైరెక్షన్
ఎమోషన్ మిస్ అయింది…
మ్యూజిక్
రేటింగ్
ఈ మూవీ కి మేమిచ్చే రేటింగ్ 2/5