Sreemukhi and Anasuya: వెండితెరపై హీరోయిన్స్ ఇమేజ్, స్టార్డం హిట్స్ నిర్ణయిస్తాయి. బుల్లితెరపై యాంకర్స్ ఫేమ్, పాపులారిటీ వాళ్లు హోస్ట్ చేస్తున్న ప్రోగ్రామ్స్ టీఆర్పీ ఆధారంగా జడ్జ్ చేస్తారు. ఒకరు యాంకరింగ్ చేస్తున్న షో టీఆర్పీ ఆశించిన స్థాయిలో లేకపోతే… నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టి మరో యాంకర్ ని లైన్ లోకి తెస్తారు. ఈ మధ్య జెమిని లో ప్రసారమైన మాస్టర్ చెఫ్ వంటల ప్రోగ్రాం విషయంలో ఇదే పరిస్థితి చోటు చేసుకుంది. స్టార్ హీరోయిన్ తమన్నా హోస్ట్ గా ప్రారంభమైన మాస్టర్ చెఫ్ ప్రోగ్రాం ఫెయిల్ అయ్యింది.

మొదట్లో పర్వాలేదు అన్నట్లున్న టీఆర్పీ రానురానూ తగ్గుతూ వచ్చింది. దీనితో నిర్వాహకులు తమన్నాను తొలగించి, అనసూయను రంగంలోకి దించారు. అనసూయ ఎంట్రీ ఇచ్చి మూడు నాలుగు వారాలు అవుతున్నా టీఆర్పీ విషయంలో ఎటువంటి మార్పు లేదట. తమన్నా ఉన్నప్పటి కంటే కూడా టీఆర్పీ తగ్గిందట. అయితే ఇంకొన్నాళ్లు చూద్దాం అని నిర్వాహకులు ఫిక్స్ అయ్యారట.
Also Read: Uppena Director: నందమూరి హీరోతో బుచ్చిబాబు నెక్స్ట్ సినిమా!
మరోవైపు శ్రీముఖి హోస్ట్ గా ఆహా యాప్ లో చెఫ్ మంత్ర పేరుతో వంటల ప్రోగ్రాం మొదలైంది. మొదటి ఎపిసోడ్ కి సిద్ధం అవుతున్న ఈ షో…రిజల్ట్ తెలియాలంటే, రెండు మూడు ఎపిసోడ్స్ పూర్తి కావాలి. మాస్టర్ చెఫ్ విషయంలో తమన్నా, అనసూయ ఫెయిల్ కాగా… అదే తరహా ఈవెంట్ చెఫ్ మంత్ర ను హోస్ట్ చేయనున్న శ్రీముఖి వైపు అందరూ చూస్తున్నారు. ఒక వేళ శ్రీముఖి ఆహాలో సక్సెస్ అయిన నేపథ్యంలో, ఆ ఒత్తిడి అనసూయ వైపుకు మళ్లుతుంది. టీఆర్పీ పెరగకపోతే.. అనసూయ స్థానంలో శ్రీముఖి వచ్చి చేరినా ఆశ్చర్యం లేదు. కాబట్టి ఇది అనసూయ, శ్రీముఖి మధ్య పరోక్షంగా పోటీ వాతావరణం క్రియేట్ చేసిందని కొందరు భావిస్తున్నారు.
Also Read: Kangana: మోదీ వ్యవసాయ చట్టాల నిర్ణయంపై కంగన అలా.. తాప్సీ ఇలా!