Sukumar Ram Charan: తెలుగు సినిమా ఇండస్ట్రీ అనగానే ప్రతి ఒక్కరికి స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకొస్తారు. మరి ఇలాంటి క్రమంలోనే స్టార్ హీరోలు తీసిన సినిమాలన్నీ సూపర్ సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్న క్రమంలో మెగా పవర్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన ఐడెంటిటిని సంపాదించుకున్న రామ్ చరణ్ సైతం గ్లోబల్ స్టార్ గా అవతరించాడు. ఇక ఇలాంటి నేపద్యంలో రామ్ చరణ్ సైతం పాన్ ఇండియా సినిమాలు చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు. తండ్రికి తగ్గ తనయుడుగా ఎదిగిన రామ్ చరణ్ ఇప్పుడు ఎల్లలు దాటి తన పేరును విస్తరింపజేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక సుకుమార్ దర్శకత్వంలో ఆయన చేయబోతున్న సినిమా విషయంలో చాలా రకాల ప్రశ్నలైతే తలెత్తుతున్నాయి. ఇప్పటికే వీళ్ళ కాంబినేషన్లో వచ్చిన ‘రంగస్థలం’ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించింది.
మరి ఇప్పుడు రాబోతున్న మూవీ ఆ సినిమాను మించి ఉండాలి. రంగస్థలం కంటే కొంచెం తగ్గిన కూడా ప్రేక్షకులు ఆ సినిమాని పెద్దగా రిసీవ్ చేసుకునే అవకాశం అయితే లేదు. కాబట్టి దానికి మించిన కథతో సినిమాను చేయాలనే ప్రయత్నంలో వీళ్ళున్నట్టుగా తెలుస్తోంది. మరి వాళ్ళు అనుకున్నట్టుగా ఈ సినిమాతో పాన్ ఇండియా ఇండస్ట్రీని షేక్ చేయగలుగుతారా? లేదా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఇక రంగస్థలం సినిమాలో క్లైమాక్స్ ట్విస్ట్ ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసిన విషయం మనకు తెలిసిందే. ఇప్పుడు వీళ్ళ కాంబో లో వస్తున్న సినిమాలో ఒక ఐదు ట్విస్టు లైతే ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. సుకుమార్ ఇప్పటివరకు ఇలాంటి ఒక కథను రాసుకోలేదని ఈ కథ కంప్లీట్ డిఫరెంట్ గా ఉండబోతుందంటూ కొన్ని వార్తలైతే వస్తున్నాయి.
మరి ఈ సినిమాతో కనక పాన్ ఇండియాలో సూపర్ సక్సెస్ ని సాధించినట్టయితే మాత్రం వీళ్ళిద్దరూ పాన్ ఇండియాలో స్టార్లుగా ఎదుగుతారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇప్పటికే ‘పుష్ప 2’ సినిమాతో రికార్డులను క్రియేట్ చేసిన సుకుమార్ ఇప్పుడు రాబోతున్న రామ్ చరణ్ సినిమాతో అంతకు మించిన సక్సెస్ ని సాధించాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది…చూడాలి మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ను సాధిస్తోంది అనేది…