https://oktelugu.com/

Indian Railways: రైలు హారన్‌ 11 రకాలు… ఒక్కో హారన్‌కు ఒక్కో అర్థం..!

మూడు చిన్న హారన్లు.. దీనికి అర్థం మోటార్‌పైన తన కంట్రోల్‌ పోయిందని లోకోపైలెట్‌ ఇచ్చే సంకేతమట. వెంటనే వాక్యూమ్‌ బ్రేక్‌ వేయాలని గార్డుకు లోకోపైలెట్‌ ఇసా సంకేతం ఇస్తాడట.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : February 29, 2024 / 04:03 PM IST
    Follow us on

    Indian Railways: హారన్‌.. ప్రతీ వాహనానికి ఉంటుంది. ముందు వెళ్లేవారిని అలర్ట్‌ చేయడానికి ప్రతీ వాహనతయారీ కంపెనీ వాహనాలకు హారన్‌ బిగిస్తుంది. అయితే బైక్‌లకు ఒక రకమైన హారన్, మూడు చక్రాల వాహనాలకు ఇంకో రకమైనది, నాలుగు చక్రాల వాహనాలకు మరో రకం, ఇలా వాహనాలను బట్టి హారన్‌ను అమరుస్తారు. అయితే రైళ్లకు కూడా హారన్‌ ఉంటుంది. అన్ని హారన్లతో పోలిస్తే రైలు హారన్‌ భిన్నం. రైలు హారన్‌ రకరకాలుగా ఉంటుంది.

    11 రకాలు..
    కూ.. చుక్‌చెక్‌.. అనగానే అందరికీ రైలు గుర్తొస్తుంది. అప్పట్లా ఇప్పుడు చుక్‌చుక్‌ లేకపోయినా కూ.. అనే హారన్‌ శబ్దం మాత్రం ఇప్పటికీ కొనసాగుతోంది. అయితే ఈ కూతలు 11 రకాలు ఉంటాయట. ఆ 11 రకాల హారన్‌ శబ్దాలకు 11 రకాల అర్థాలు కూడా ఉన్నాయని రైల్వే శాఖ తెలుపుతోంది. అవేంటో తెలుసుకుందాం.

    – రైలు హారన్‌ కిలోమీటర్‌ దూరం వరకు వినిపిస్తుంది. రాత్రి వేళల్లో అయితే 2 కిలోమీటర్ల వరకు వినిపిస్తుంది. రైల్వే గార్డులు, సిబ్బంది, ప్రయాణికులను అలర్ట్‌ చేసేందుకు హెచ్చరించేందుకు లోకెపైలెట్లు హారన్‌ కొడతారు. రైలు స్టేషన్‌లోకి వచ్చేటప్పుడు, స్టేషన్‌ నుంచి బయల్దేరేటప్పుడు హారన్‌ తప్పనిసరి. రైల్వు సిబ్బందికి హారన్‌ ద్వారా సూచనలు కూడా ఇస్తారు.

    – ఒక చిన్న హారన్‌ కొడితే.. లోకోపైలెట్‌ ఒక చిన్న హారన్‌ కొడితే రైలు బోగీలను శుబ్రం చేయడానికి యార్డుకు తీసుకెళ్తున్నట్లు అర్థం.

    – రెండు చిన్న హారన్లను వెంటవెంటనే కొడితే స్టేషన్‌ నుంచి రైలు బయల్దేరడానికి సిద్ధంగా ఉందని సంకేతమట. ఇది సిగ్నల్‌ ఇవ్వాలని గార్డుకు సూచన అట.

    – మూడు చిన్న హారన్లు.. దీనికి అర్థం మోటార్‌పైన తన కంట్రోల్‌ పోయిందని లోకోపైలెట్‌ ఇచ్చే సంకేతమట. వెంటనే వాక్యూమ్‌ బ్రేక్‌ వేయాలని గార్డుకు లోకోపైలెట్‌ ఇసా సంకేతం ఇస్తాడట.

    – నాలుగు చిన్న హారన్లు వరుసగా మోగితే రైలులో ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తిందని అర్థం. రైలు కదిలే పరిస్థితి లేదని రైల్వే అధికారులకు తెలియజేడయం.

    – ఇక కంటిన్యూగా హారన్‌ కొడితే.. వచ్చే స్టేసన్‌లో హాల్టింగ్‌ లేదని, రైలు ఆగదని అర్థం. ప్రయాణికులను అలర్ట్‌ చేయడానికి లోకోపైలెట్‌ ఇలా హారన్‌ కొడతాడు. నాన్‌స్టాప్, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు వచ్చినప్పుడు ఇలా హారన్‌ ఇస్తారు.

    – రైలు ఇంజిన్‌ స్టార్ట్‌ చేయడానికి బ్రేక్‌ పైపు ఇంజిన్‌ సెట్‌ చేయాలని సూచించేందుకు ఒక లాంగ్, ఒక షార్ట్‌ హారన్‌ ఇస్తారు.

    – రైలు ఇంజిన్‌ను కంట్రోల్‌లోకి తీసుకోమని లోకోపైలెట్‌ రెండు లాంగ్, రెండు షార్ట్‌ హారన్లు ఇస్తాడు.

    – రైల్వే క్రాసింగ్‌ దాటే సమయంలో అక్కడ ఉన్నవారిని అలర్ట్‌ చేసేందుకు లోకోపైలెట్‌ రెండు స్వల్ప విరామాలతో రెండు హారన్లు మోగిస్తాడు.

    – రైళ్లు ట్రాక్‌ మారేటప్పుడు కూడా లోకోపైలెట్లు రెండు లాంగ్, రెండు షార్ట్‌ హారన్లు మోగించాలని రైల్వే శాఖ సూచించిన ముఖ్య నిబంధన.

    – చైన్‌ లాగినప్పుడు.. రైలులో ఎవరైనా చైన్‌ లాగితే లోకోపైలెట్‌ రైలు ఆపడంతోపాటు రెండు షార్ట్, రెండు లాంగ్‌ హారన్లు ఇస్తాడు. వాక్యూమ్‌ బ్రేక్‌ ఉపయోగించినప్పుడు కూడా ఇదేతరహాలో హారన్‌ ఇస్తారు.

    – ప్రమాదం జరిగే సమయంలో.. ఆరుసార్లు షార్ట్‌ హారన్‌ మోగించాలని శిక్షణ సమయంలోనే సూచిస్తారు. ఆరుసార్లు షార్ట్‌ హారన్‌ వచ్చిందంటే ప్రమాదం జరుగుతుందని అర్థం. అప్పుడు ప్రయాణికులు అప్రమత్తం కావాలి.

    రైలు లోకోపైలెట్‌ అప్రమత్తంగా ఉంటూ హారన్లను మోగించడంలోనూ అప్రమత్తంగా ఉండాలి. ప్రయాణికులు కూడా ఈ 11 రకాల హారన్లకు అర్థం తెలుసుకోవడం మంచిదే అని రైల్వే అధికారులు పేర్కొంటున్నారు.