TVR Ratings: కొత్త సీరియల్స్ రూపొందించాం. ఒకప్పటి అంతరంగాలు స్థాయికి ఎదుగుతాం. దానికి కీర్తి సురేష్ ను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకున్నాం. ఆమె ద్వారా ప్రచారం చేస్తున్నాం. ఇకపై మేము కొట్టే దెబ్బలకు స్టార్ మా వెన్నుపూస విరుగుతుంది. జీ తెలుగు బద్దలు బాసింగాలు అవుతాయి. జెమిని సోది లో లేకుండా పోతుంది ఇదిగో ఇలానే సాగిపోయింది ఈటీవీ డాంబికం. కానీ వాస్తవ పరిస్థితి ఏందిరా అయ్యా అంటే.. ఇప్పటికీ రామోజీరావు ఛానల్ ను కాస్త కూస్తో కాపాడుతోంది రాత్రిపూట ప్రసారమయ్యే ఈటీవీ న్యూస్ మాత్రమే. నిష్ఠురంగా ఉన్నప్పటికీ ఇదే నిజం. టివిఆర్ రేటింగ్స్ ఇవే చెబుతున్నాయి.
తాజారేటింగ్స్ ప్రకారం ఈటీవీలో టాప్ సీరియల్గా మనసంతా నువ్వే కొనసాగుతోంది. ఇదేం తోపు సీరియల్ కాదు.. క్రిస్పీ కథనం అంతకన్నా కాదు. కాకపోతే ఉన్న వాటిల్లో ఇదే బెటర్. వాస్తవానికి ఈటీవీలో వచ్చే కొన్ని సీరియల్స్ కంటే ఈటీవీ న్యూస్ కు రేటింగ్స్ ఎక్కువ రావడం గమనార్హం. ఉదయ్ కిరణ్ నటించిన సూపర్ హిట్ సినిమా పేరుతో.. టెలికాస్ట్ అయ్యే ఓ సీరియల్ తర్వాత రేటింగ్స్ విషయంలో ఈటీవీ న్యూస్ సెకండ్ ప్లేస్ లో ఉంది. ఆ తర్వాత రంగులరాట్నం, బొమ్మరిల్లు సీరియల్స్ కొనసాగుతున్నాయి. వీటి రేటింగ్స్ 3.47 ను మించడం లేదు.. ఎంత జాకీలు పెట్టి లేపినా.. ఎంత గొప్పగా ప్రచారం చేసిన ఈ సీరియల్స్ ఊహించిన స్థాయిలో ఆదరణ సొంతం చేసుకోలేకపోతున్నాయి. చివరికి మైలేజ్ పెంచడానికి.. ఈ టీవీ యాజమాన్యం కీర్తి సురేష్ ను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకున్నప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది.
Also Read: ‘హరి హర వీరమల్లు’ గురించి డైరెక్టర్ క్రిష్ సంచలన ట్వీట్!
ఈటీవీలో ఒకప్పుడు అద్భుతమైన సీరియల్స్ వచ్చేవి. అంతరంగాలు, ఇది కథ కాదు, విధి, అన్వేషిత, లేడీ డిటెక్టివ్, వసుంధర, అందం, మనోయజ్ఞం తెలుగు టెలివిజన్ రంగాన్ని శాసించాయి. ఒకరకంగా ఈటీవీ ప్రస్థానాన్ని మరో స్థాయికి తీసుకెళ్లాయి. కానీ ఆ తర్వాత నవ్యత దిశగా యాజమాన్యం ఆలోచించకపోవడం.. రోడ్డ కొట్టుడు సీరియల్స్ రూపొందించడం.. ఇవన్నీ కూడా ఈటీవీ ప్రస్థానాన్ని ప్రభావితం చేస్తున్నాయి. వాస్తవానికి ఈటీవీ దగ్గర మిగతా వాటి కంటే ఎక్కువ సాధన సంపత్తి ఉంది. అంతకుమించి ఫిలిం సిటీ ఉంది. అయినప్పటికీ వాడుకోవడంలో.. ఉపయోగించుకోవడంలో యాజమాన్యం విఫలమవుతోంది. దానికి నిదర్శనమే ఈ నేలబారు రేటింగ్స్. ఇంతకంటే చెప్పుకోవడానికి ఏమీ లేదు. స్టార్ మా, జీ తెలుగు లో ప్రసారమయ్యే చానల్స్ రేటింగ్స్ విషయంలో దూసుకుపోతున్నాయి. చివరికి కార్తీకదీపం నవ వసంతం కూడా తిరుగులేని స్థాయిలో రేటింగ్స్ సొంతం చేసుకుంటున్నది. అదే సాగదితతో తీస్తున్నప్పటికీ జనం కళ్ళు అప్పగించుకొని మరి చూస్తున్నారు. కానీ ఇదే మ్యాజిక్ ఈటీవీ కి వర్కౌట్ కావడం లేదు. ఇంతకీ లోపం ఎక్కడుంది అంటారు?!