Telangana Elections 2023: తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల హీట్ నడుస్తుంది. మూడు ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. నేనున్నానంటూ జనసేన కూడా జాయిన్ అయ్యింది. అయితే బీజేపీతో పాటు ఉమ్మడిగా బరిలో దిగుతుంది. ఈ ఐదేళ్లు ఒకెత్తు, ఎన్నికల నెల ఒకెత్తు. పార్టీల హామీల, నేతల ప్రసంగాలు జయాపజయాలను నిర్ణయిస్తాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు రాజకీయ పార్టీలు ఎత్తుగడలు వేస్తాయి, వ్యూహాలు పన్నుతాయి.
View this post on Instagram
కాగా తెలంగాణ రాజకీయ పార్టీలు బుల్లితెర స్టార్స్ ద్వారా ఓటర్లను ప్రభావితం చేయాలని చూస్తున్నాయి. ఈ క్రమంలో శ్రీముఖి, అనసూయ, అషురెడ్డి, హరి తేజ, విష్ణుప్రియతో పాటు పలువురు యాంకర్స్ ఓ పార్టీకి సపోర్ట్ గా వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. తెలంగాణ ఎన్నికల సమరంలో తాము కూడా ఉన్నామని చెబుతున్నారు. ఎవరెవరు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారంటే… అందరూ అధికార బీఆర్ఎస్ కి మద్దతు పలికారు.
నిజామాబాద్ అమ్మాయి అయిన శ్రీముఖి కేసీఆర్ ప్రభుత్వంలో తన ఊరిలో జరిగిన అభివృద్ధి గురించి మాట్లాడుతూ వీడియో చేసింది. 2014 తర్వాత డ్రైనేజీలు, రోడ్లు వచ్చాయన్నారు. పరోక్షంగా బీఆర్ఎస్ కి ఓటు వేయాలని కోరారు.
View this post on Instagram
ఇక అషురెడ్డి హైదరాబాద్ లో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ ఓ వీడియో చేసింది. హైదరాబాద్ పారిశ్రామికంగా, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందిందంటూ హైదరాబాద్ లో కొత్తగా ఏర్పడ్డ ప్రముఖ ప్రదేశాల గురించి చెప్పింది.
కేసీఆర్ వచ్చాక హైదరాబాద్ లో ట్రాఫిక్ కష్టాలు తగ్గాయని విష్ణుప్రియ అభిప్రాయపడింది. పదేళ్ల క్రితం తెలంగాణకు ప్రస్తుత తెలంగాణకు చెప్పలేనంత మార్పు ఉందని చెప్పారు.
ఇక యాంకర్ హరితేజ అర్హులైన మహిళలకు కేసీఆర్ ప్రభుత్వం చేసిన మంచి, అమలు చేస్తున్న పథకాలు, చేయనున్న పథకాల గురించి చెబుతూ వీడియో చేసింది.
కేసీఆర్ వచ్చాక దండగ వ్యవసాయం పండగ వ్యవసాయం అయ్యింది. పంటలు బాగా పండుతున్నాయి. రైతులు లబ్ధి పొందుతున్నారంటూ చెప్పుకొచ్చింది. అలాగే జోర్దార్ సుజాత కేసీఆర్ ప్రభుత్వానికి మద్దతుగా మరో వీడియో చేసింది. వీరందరూ బీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలని చెబుతన్నారు. వీరందరూ స్వచ్ఛంగా ఈ ప్రచారం చేస్తున్నారని చెప్పలేం. ఖచ్చితంగా డబ్బులతో చేయిస్తున్న వ్యవహారమే అనేది స్పష్టం. లేదంటే అందరూ ఒకే పార్టీకి సపోర్ట్ చేయడం జరగని పని.
View this post on Instagram