అది ‘నాని’కి ఇష్టం లేదట.. కారణమదే !

‘టక్ జగదీష్’ సినిమా ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసుకొని ఫస్ట్ కాపీతో రెడీగా ఉంది. అన్ని బాగుండి ఉంటే.. ఈ పాటికే అనగా ఈ నెల 23న ఈ సినిమా విడుదల కావాలి, కానీ ఏమి చేస్తాం ప్లాన్ చేసుకున్న ప్రతిదీ వర్కౌట్ కాదుగా. కోవిడ్ సెకండ్ వేవ్ రూపంలో సినిమా విడుదల డేట్ ని మార్చాల్సి వచ్చింది. మళ్ళీ కొత్త డేట్ ఎప్పుడు అనేది ఇప్పుడే ఎవరూ చెప్పలేరు కాబట్టి… నిర్మాతలకు ఒక ఆలోచన […]

Written By: Bhaskar, Updated On : April 22, 2021 11:57 am
Follow us on

‘టక్ జగదీష్’ సినిమా ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసుకొని ఫస్ట్ కాపీతో రెడీగా ఉంది. అన్ని బాగుండి ఉంటే.. ఈ పాటికే అనగా ఈ నెల 23న ఈ సినిమా విడుదల కావాలి, కానీ ఏమి చేస్తాం ప్లాన్ చేసుకున్న ప్రతిదీ వర్కౌట్ కాదుగా. కోవిడ్ సెకండ్ వేవ్ రూపంలో సినిమా విడుదల డేట్ ని మార్చాల్సి వచ్చింది. మళ్ళీ కొత్త డేట్ ఎప్పుడు అనేది ఇప్పుడే ఎవరూ చెప్పలేరు కాబట్టి… నిర్మాతలకు ఒక ఆలోచన వచ్చింది. టికెట్ బేస్డ్ న సినిమాని డైరెక్ట్ గా ఓటిటిలో రిలీజ్ చేద్దామా అని. టికెట్ ను కొనుక్కొని సినిమాని చూస్తే, థియేటర్స్ కంటే ఎక్కువ రెవిన్యూ వస్తోంది. అనవసరంగా థియేటర్స్ రెంట్ కూడా పే చెయ్యక్కర్లేదు కదా అంటూ నిర్మాతలు ఆలోచనలో పడ్డారు.

కాకపోతే ఈ ఆలోచన నానికి నచ్చేలా లేదు. ఎందుకు సినిమాని ఓటిటీలో రిలీజ్ చేయాలి ? మన సినిమాకి ఓపెనింగ్స్ భారీగా వస్తాయి, అవన్నీ మిస్ అవ్వడం నాకు ఇష్టం లేదు, అయినా టక్ జగదీష్ ఓటిటీ సినిమా కాదు, దయచేసి ఆ ఆలోచన చేయొద్దని నిర్మాతలకు ఖరాఖండిగా చెప్పేశాడట నాని. అయితే నాని అల చెప్పడానికి ఒక కారణం ఉంది.. ఈ సినిమాని ఇంటిల్లిపాది థియేటర్లో చూడాలి అనేది నాని కోరిక. పైగా ఈ సినిమాతో తనకు ఫ్యామిలీ ఆడియన్స్ పరంగా కూడా ఎక్కువగా రీచ్ ఉంటుందని నాని నమ్మకం. పైగా నాని ఇప్పటికే సినిమా కూడా చూసాడు. సినిమాలో మ్యాటర్ ఉందా లేదా అని కనిపెట్టడంలో నానికి జడ్జ్ మెంట్ ఉంది.

కాబట్టి సినిమా చూసి కూడా నాని, సినిమాని థియేటర్స్ లోనే రిలీజ్ చేద్దాం అంటున్నాడు అంటే.. కచ్చితంగా టక్ జగదీష్ లో సాలిడ్ మ్యాటర్ ఉండి ఉంటుంది. పైగా ఓటిటీ రిలీజ్ నానికి కలిసి రాలేదు. గతేడాది “వి” సినిమాని డైరెక్ట్ గా ఓటిటిలో రిలీజ్ చేశాడు. అప్పుడున్న పరిస్థితుల్లో ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. అయితే, అప్పుడు ఆ నిర్ణయమే ఆ సినిమా డిజాస్టర్ అవ్వడానికి కారణమనే అభిప్రాయం నానిలో ఉందట. అందుకే ఇప్పుడు టక్ జగదీష్ సినిమాని థియేటర్లోనే విడుదల చేద్దామని నాని పట్టుబట్టాడు. ‘టక్ జగదీష్’కి శివ నిర్వాణ దర్శకుడు. రీతూ వర్మ హీరోయిన్. కాంబినేషన్ పరంగా కూడా మంచి అంచనాలు ఉన్నాయి.