https://oktelugu.com/

Bigg Boss 6 Telugu: హోస్ట్ నాగార్జునకు దారుణమైన అవమానం… ఇలా జరుగుతుందని ఆయన కూడా ఊహించి ఉండరు

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ హోస్ట్ నాగార్జునకు భారీ షాక్ తగిలింది. సీజన్ 6 లాంచింగ్ ఈవెంట్ టీఆర్పీ చూసి ఆయన మైండ్ బ్లాక్ అయ్యింది. ఇంత దారుణమైన రేటింగ్ బహుశా ఆయన కూడా ఊహించి ఉండరు. బిగ్ బాస్ హోస్ట్ గా నాగార్జున సూపర్ సక్సెస్. ఆయన నేతృత్వంలో ఈ షో రికార్డు టీఆర్పీ నమోదు చేసింది. నాగార్జున ఎనర్జీ, హ్యూమర్, మాట తీరు షోకి ప్రత్యేక ఆకర్షణ. ఈ అరవై ఏళ్ల […]

Written By:
  • Shiva
  • , Updated On : September 16, 2022 / 10:37 AM IST
    Follow us on

    Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ హోస్ట్ నాగార్జునకు భారీ షాక్ తగిలింది. సీజన్ 6 లాంచింగ్ ఈవెంట్ టీఆర్పీ చూసి ఆయన మైండ్ బ్లాక్ అయ్యింది. ఇంత దారుణమైన రేటింగ్ బహుశా ఆయన కూడా ఊహించి ఉండరు. బిగ్ బాస్ హోస్ట్ గా నాగార్జున సూపర్ సక్సెస్. ఆయన నేతృత్వంలో ఈ షో రికార్డు టీఆర్పీ నమోదు చేసింది. నాగార్జున ఎనర్జీ, హ్యూమర్, మాట తీరు షోకి ప్రత్యేక ఆకర్షణ. ఈ అరవై ఏళ్ల అందగాడు గత మూడు సీజన్స్ విజయవంతంగా నడిపిస్తున్నాడు. 2017లో ఎన్టీఆర్ హోస్ట్ గా బిగ్ బాస్ తెలుగు ప్రారంభమైంది. తెలుగు ఆడియన్స్ కి పరిచయం లేని ఈ రియాలిటీ షో సక్సెస్ అవుతుందా అనే అనుమానాలు ఏర్పడ్డాయి. అయితే ఎన్టీఆర్ తన టాలెంట్ తో విజయపథంలో నడిపించారు.

    Nagarjuna

    నెక్స్ట్ సీజన్ కి హోస్ట్ గా ఎన్టీఆర్ తప్పుకున్నారు. ఆయన స్థానంలో హీరో నాని వచ్చారు. ఆయనకు ప్రేక్షకులు యావరేజ్ మార్కులు వేశారు. బిగ్ బాస్ సీజన్ 3కి నాగార్జున ఎంట్రీ ఇచ్చారు. నాలుగు సీజన్స్ నుండి ఆయనే కొనసాగుతున్నారు. ప్రస్తుత సీజన్ ఆయనకు వరుసగా నాలుగవది. మధ్యలో ఓటీటీ వర్షన్ బిగ్ బాస్ నాన్ స్టాప్ కి కూడా హోస్టింగ్ చేశారు. కాగా కంటెస్టెంట్స్ ని పరిచయం చేసే లాంచింగ్ ఈవెంట్ కి ప్రత్యేక ఆదరణ ఉంటుంది. ఆ రోజు బిగ్ బాస్ ప్రేమికులు టీవీలకు అతుక్కుపోతారు.

    ఈ క్రమంలో స్టార్ మా ఆరోజు భారీ టీఆర్పీ రాబడుతుంది. గతంలో బిగ్ బాస్ లాంచింగ్ ఎపిసోడ్స్ రికార్డు స్థాయిలో టీఆర్పీ అందుకున్నాయి. అయితే బిగ్ బాస్ సీజన్ 6 ఫస్ట్ ఎపిసోడ్ భారీ షాక్ ఇచ్చింది. దారుణమైన రేటింగ్ అందుకొని నాగార్జునకు, నిర్వాహకులను నిరాశపరిచింది. గతంలో నమోదైన నంబర్స్ లో సగం రేటింగ్ కూడా బిగ్ బాస్ తెలుగు 6 లాంచింగ్ ఎపిసోడ్ కి రాలేదు. సెప్టెంబర్ 4న ప్రైమ్ టైం లో ప్రసారమైన బిగ్ బాస్ తెలుగు 6 లాంచింగ్ ఎపిసోడ్ కేవలం 8.86 రేటింగ్ రాబట్టింది.

    Bigg Boss 6 Telugu

    ఇది గత ఐదు సీజన్స్ తో పోల్చితే చాలా అత్యల్పం. బిగ్ బాస్ తెలుగు 4 లాంచింగ్ ఎపిసోడ్ అత్యధికంగా 18.5 టీఆర్పీ అందుకుంది. ఇక ఆరు సీజన్స్ లాంచింగ్ ఎపిసోడ్స్ టీఆర్పీ చూస్తే బిగ్ బాస్ తెలుగు1- 16.18, బిగ్ బాస్ తెలుగు 2- 15.05, బిగ్ బాస్ తెలుగు 3- 17.9, బిగ్ బాస్ తెలుగు 4- 18.5, బిగ్ బాస్ తెలుగు 5- 15.7, బిగ్ బాస్ తెలుగు 6- 8.86 టీఆర్పీ రేటింగ్స్ నమోదు చేశాయి. ఇదే రోజు ఆసియా కప్ లో భాగంగా ఇండియా-పాకిస్తాన్ మధ్య 20-20 మ్యాచ్ ఉండగా… బిగ్ బాస్ షో టీఆర్పీని భారీగా దెబ్బతీసింది.

    Tags