Devara’ Ayudha Puja song : దేవర’ ఆయుధ పూజ సాంగ్ ఇలా ఉందేంటి.. సోషల్ మీడియా లో ట్రోల్స్ మామూలుగా లేవుగా!

ఇది ఇలా ఉండగా ఈ పాటకు ముందు విడుదలైన 'దావుది..దావుది' సాంగ్ కి ప్రారంభం లో డివైడ్ టాక్ వచ్చిన సంగతి మన అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు ఆ పాట చార్ట్ బస్టర్ అయిపోయింది.

Written By: Vicky, Updated On : September 26, 2024 9:00 pm

Trolls on social media over 'Devara' Ayudha Puja song

Follow us on

Devara Ayudha Puja song : కోట్లాది మంది అభిమానులు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూసిన ఎన్టీఆర్ ‘దేవర’ చిత్రం మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ కూడా కనీవినీ ఎరుగని రేంజ్ లో జరిగాయి. ఆరేళ్ళ తర్వాత వస్తున్న ఎన్టీఆర్ సినిమా కి ఎలాంటి అడ్వాన్స్ బుకింగ్స్ జరగాలో, అలాంటి బుకింగ్స్ ఈ చిత్రానికి జరిగాయి. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 70 కోట్ల రూపాయిలు గ్రాస్ వసూళ్లు వచ్చాయట.ఇక టాక్ వస్తే ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు. ‘కల్కి’ చిత్రం తర్వాత పెద్ద హీరో సినిమా విడుదలై చాలా రోజులు అవ్వడం ఈ సినిమాకి బాగా ప్లస్ అయ్యింది.

ఇది ఇలా ఉండగా ఇప్పటి వరకు ఈ చిత్రం నుండి విడుదలైన ప్రతీ పాట ఎలా హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం కాదు. కేవలం తెలుగు లో మాత్రమే కాదు, ఈ పాటలు సౌత్ మొత్తాన్ని ఒక ఊపు ఊపేసింది. అయితే ఈ చిత్రం లో వచ్చే ‘ఆయుధ పూజ’ పాట ఇప్పటి వరకు విడుదలైన సాంగ్స్ అన్నిటికంటే పెద్ద హిట్ అవుతుందని, అభిమానులు వెర్రెక్కిపోతారని మేకర్స్ సోషల్ మీడియా ద్వారా చెప్పుకొచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. అభిమానులు ఆ పాటను విడుదల చేయమని మేకర్స్ ని కోరగా, ఇప్పుడు కాదు, చివర్లో విడుదల చేస్తాం, ఆ పాట విడుదల అయ్యాక సోషల్ మీడియా లో విస్ఫోటనం మొదలవ్వుద్ది అని బీభత్సమైన ఎలివేషన్స్ ఇచ్చారు మేకర్స్. నేడు కాసేపటి క్రితమే ఆ పాటని విడుదల చేసారు. దానిని విన్న తర్వాత యావరేజి గా ఉంది, కానీ మేకర్స్ చెప్పినంతగా లేదే అని అందరికీ అనిపించింది. కానీ విజువల్ గా ఈ పాట అదిరిపోతుందట. ఎన్టీఆర్ వేసిన స్టెప్పులు ఈ పాటలు హైలైట్ గా నిలుస్తుందని టాక్. రిలీజ్ ట్రైలర్ చివర్లో ఎన్టీఆర్ సైఫ్ అలీ ఖాన్ కలిసి డ్యాన్స్ వేసేది ఈ పాటకే అట.

ఇది ఇలా ఉండగా ఈ పాటకు ముందు విడుదలైన ‘దావుది..దావుది’ సాంగ్ కి ప్రారంభం లో డివైడ్ టాక్ వచ్చిన సంగతి మన అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు ఆ పాట చార్ట్ బస్టర్ అయిపోయింది. ఎక్కడ చూసినా ఆ పాటనే వినిపిస్తుంది. ఎంటర్టైన్మెంట్ షోస్ లో కూడా తెగ వాడేస్తున్నారు. ఎన్టీఆర్ వేసిన స్టెప్పు బాగా వైరల్ అయ్యింది. ఇంస్టాగ్రామ్ లో ఆ స్టెప్పు ని ఇమిటేట్ చేస్తూ లక్షల సంఖ్యలో రీల్స్ కూడా చేసారు నెటిజెన్స్. నేడు ‘దేవర’ చిత్రానికి ఈ స్థాయి క్రేజ్, హైప్ వచ్చేందుకు అనిరుద్ అందించిన అద్భుతమైన మ్యూజిక్ కూడా ఒక కారణం అని అంటున్నారు విశ్లేషకులు. ఇలా ఎన్నో అంచనాలను రేకెత్తించిన ఈ చిత్రం ఆ అంచనాలను అందుకుంటుందా లేదా అనేది మరి కాసేపట్లో తెలియనుంది.