https://oktelugu.com/

Devara Hindi Advance Bookings : తీవ్రంగా నిరాశపర్చిన ‘దేవర’ హిందీ అడ్వాన్స్ బుకింగ్స్..10 ఏళ్ళ క్రితం వచ్చిన రామ్ చరణ్ ‘తుఫాన్’ ని కూడా దాటలేకపోయింది!

బుక్ మై షో యాప్ లో జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ ప్రకారం ఈ సినిమాకి బాలీవుడ్ లో కోటి రూపాయిల గ్రాస్ వసూళ్లు కూడా రాలేదట. ఈ సినిమాకి అక్కడ డీసెంట్ స్థాయి ఓపెనింగ్ రావాలంటే కచ్చితంగా బీభత్సమైన పాజిటివ్ టాక్ రావాల్సిన అవసరం ఉందని అంటున్నారు.

Written By:
  • Vicky
  • , Updated On : September 26, 2024 / 09:04 PM IST

    Devara Hindi Advance Bookings

    Follow us on

    Devara Hindi Advance Bookings : ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘దేవర’ కాసేపట్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఆరేళ్ళ పాటు అభిమానులు ఎదురుచూపులు తగ్గట్టుగా డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాని తీసాడా లేదా అని అభిమానులు టెన్షన్ తో ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కి అభిమానులు చాలా సంతృప్తి చెందారు. దానికి తగ్గట్టుగానే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా జరిగాయి. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఈ చిత్రానికి మొదటి రోజు 70 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయట. సీడెడ్ లో అయితే #RRR రికార్డ్స్ ని అనేక సెంటర్స్ లో బద్దలు కొట్టే ఛాన్స్ ఉందని అంటున్నారు.

    అలాగే నార్త్ అమెరికా లో ఈ సినిమా ఇప్పటి వరకు కేవలం ప్రీమియర్ షోస్ నుండి 3 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు వస్తాయట. ‘కల్కి’ , ‘#RRR’ చిత్రాల తర్వాత మళ్ళీ ఈ చిత్రానికే అలాంటి వసూళ్లు వచ్చాయి. కానీ బెంగళూరు, చెన్నై వంటి ప్రాంతాలలో యావరేజ్ అడ్వాన్స్ బుకింగ్స్ ఈ చిత్రానికి నమోదయ్యాయి. ఇదంతా పక్కన పెడితే #RRR చిత్రం తర్వాత బాలీవుడ్ లో ఎన్టీఆర్ క్రేజ్ బాగా పెరిగిందని ఆయన అభిమానులు అనుకునేవారు. బాలీవుడ్ లో మా హీరో ప్రభాస్ కంటే పెద్ద స్టార్, కావాలంటే ‘దేవర’ కి చూస్కోండి అంటూ సోషల్ మీడియా లో ఛాలెంజ్ కూడా విసిరేవారు. కానీ బాలీవుడ్ లో ప్రభాస్ ని మించిన టాలీవుడ్ స్టార్ మరొకరు లేరని నిరూపితమైంది. బుక్ మై షో యాప్ లో జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ ప్రకారం ఈ సినిమాకి బాలీవుడ్ లో కోటి రూపాయిల గ్రాస్ వసూళ్లు కూడా రాలేదట. ఈ సినిమాకి అక్కడ డీసెంట్ స్థాయి ఓపెనింగ్ రావాలంటే కచ్చితంగా బీభత్సమైన పాజిటివ్ టాక్ రావాల్సిన అవసరం ఉందని అంటున్నారు.

    ‘కల్కి’, ‘సలార్’ ఓపెనింగ్ వసూళ్లకు బాలీవుడ్ లో ఈ చిత్రం దరిదాపుల్లోకి కూడా వెళ్ళదు అనే విషయం అందరికీ అర్థం అవుతుంది కానీ, కనీసం రాధే శ్యామ్, జంజీర్, లైగర్, పుష్ప చిత్రాల ఓపెనింగ్ వసూళ్లను అయినా దాటుతుండగా లేదా అనే అనుమానం ట్రేడ్ లో కలిగింది. 2013 వ సంవత్సరం లో రామ్ చరణ్ బాలీవుడ్ లోకి ‘జంజీర్’ చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చాడు. తెలుగు లో ఈ సినిమాని ‘తుఫాన్’ గా దబ్ చేసి విడుదల చేసారు. రెండు భాషల్లో పెద్ద ఫ్లాప్ అయ్యింది కానీ, ఓపెనింగ్స్ మాత్రం పర్వాలేదు అనిపించింది. ముఖ్యంగా బాలీవుడ్ లో ఈ చిత్రానికి 3 కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లు వచ్చాయి. కానీ దేవర కి ఫ్లాప్ టాక్ వస్తే 2 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు రావడం కూడా కష్టమే అని అంటున్నారు. మరి ఇందులో ఏది నిజం అవుతుందో తెలియాలంటే రేపు సాయంత్రం వరకు ఆగాల్సిందే.