Kannappa and Akshay Kumar : మంచు విష్ణు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని తన డ్రీం ప్రాజెక్ట్ అని చెప్పుకుంటూ తెరకెక్కిస్తున్న సినిమా ‘కన్నప్ప’. సుమారుగా ఈ సినిమా కోసం ఆయన 200 కోట్ల రూపాయిలను ఖర్చు చేస్తున్నాడు. టాలీవుడ్ నుండి ప్రభాస్, బాలీవుడ్ నుండి అక్షయ్ కుమార్, శాండిల్ వుడ్ నుండి శివ రాజ్ కుమార్, మాలీవుడ్ నుండి మోహన్ లాల్, ఇలా ఎంతోమంది సూపర్ స్టార్స్ ని ఈ సినిమా కోసం తీసుకొచ్చారు. మోహన్ బాబు మీద ఉన్న గౌరవం, అభిమానం తో డేట్స్ అడిగిన వెంటనే ప్రతీ ఒక్కరు ఇచ్చేసారు. ప్రభాస్ కి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి అయ్యింది. గత ఏడాది డిసెంబర్ లోనే ఈ చిత్రాన్ని విడుదల చేయాలని అనుకున్నారు. కానీ గ్రాఫిక్స్ వర్క్ చాలా వరకు బ్యాలన్స్ ఉండడంతో వాయిదా వేశారు. ఈ ఏడాది ఏప్రిల్ 25 న ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో విడుదల చేయబోతున్నారని కాసేపటి క్రితమే అక్షయ్ కుమార్ ఫస్ట్ లుక్ పోస్టర్ ద్వారా తెలిపారు.
మహాశివుడి లుక్ లో కనిపించిన అక్షయ్ కుమార్ ఫస్ట్ లుక్ పోస్టర్ కి సోషల్ మీడియా లో నెటిజెన్స్ నుండి తీవ్రమైన ట్రోల్స్ ఎదురు అయ్యాయి. అసలు ఆ పోస్టర్ ఏంటి, అమీర్ పేట ఎడిటింగ్ లాగా ఉంది. మెడ దగ్గర నీలం రంగు చూసేందుకు చాలా ఆర్టిఫీషియల్ గా అనిపిస్తుంది. చిన్న పిల్లవాడు కూడా ఇంతకంటే అద్భుతంగా ఎడిటింగ్ చేయగలడు అంటూ ట్రోల్స్ వేస్తున్నారు. మరోపక్క ప్రభాస్ అభిమానులు కూడా మూవీ టీం పై మండిపడుతున్నారు. క్వాలిటీ చాలా నీచంగా ఉందని, మా ప్రభాస్ ఫస్ట్ లుక్ కి జాగ్రత్తలు తీసుకొని బాగా ఉండేలా చేయకపోతే చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. మొదటి నుండి ఈ చిత్రంలో ప్రభాస్ శివుడి పాత్రలో నటిస్తున్నాడని టాక్ నడిచేది. టీజర్ లో ఆయనకు సంబంధించిన చిన్న షాట్ ని చూసి శివుడి పాత్ర అనే అనుకున్నారు.
కానీ ఇప్పుడు అధికారికంగా ఆ పాత్రలో అక్షయ్ కుమార్ నటిస్తున్నాడని ఖరారు చేయడం తో మరి ప్రభాస్ ఏ పాత్రలో నటించబోతున్నాడని చర్చించుకుంటున్నారు. దీనిపై మూవీ టీం ప్రస్తుతానికి సస్పెన్స్ లోనే ఉంచింది. అయితే అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఇందులో ప్రభాస్ లో నంది క్యారక్టర్ చేసినట్టుగా చెప్తున్నారు. ఏ హీరో అయినా తమ అభిమాన హీరో ని అందరికంటే అత్యంత పవర్ ఫుల్ పాత్రలో చూడాలని కోరుకుంటారు. అందులోనూ ప్రభాస్ లాంటి సూపర్ స్టార్ గురించి అంచనాలు భారీగా ఉంటాయి. కచ్చితంగా ఆయన్ని మహాశివుడి రోల్ లో అభిమానులు ఊహించుకొని ఉంటారు. కానీ ఇప్పుడు నంది క్యారక్టర్ అనే ప్రచారం జరుగుతుండడంతో అభిమానులు కాస్త నిరాశకు గురయ్యారు. అదే విధంగా ఈ చిత్రంలో పార్వతి గా కాజల్ అగర్వాల్ నటిస్తుంది. ఆమెకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా కొద్దిరోజుల క్రితమే విడుదల చేసారు.