https://oktelugu.com/

Adipurush Trolls : ఇచ్చి పడేస్తున్నరు.. ఆదిపురుష్ పై సోషల్ మీడియాలో మీమర్స్ ట్రోల్స్.. చూస్తే నవ్వాపుకోలేరు

సినిమా మాటెలా ఉన్నా దీనిపై నెగెటివ్ రివ్యూస్ ఇచ్చేవారికి ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం గట్టిగానే కౌంటర్లు వేస్తున్నారు. మీమ్స్ తో ట్రోల్ చేస్తున్నారు. అలాగే మీమర్స్ కూడా సినిమా లోని కొన్ని సన్నివేశాలపై ట్రోల్ చేస్తున్నారు.

Written By:
  • NARESH
  • , Updated On : June 17, 2023 / 09:36 AM IST
    Follow us on

    Adipurush trolls : ఎన్నో విమర్శలు, వాయిదాలు, వివాదాల తర్వాత భారీ ఎత్తున రిలీజైంది ఆదిపురుష్ సినిమా. ఆర్ఆర్ఆర్ మూవీ ఓపెనింగ్స్ ను క్రాస్ చేసింది. అడ్వాన్స్ బుకింగ్ లో కొత్త ట్రెండ్ ను సృష్టించింది. తొలి రోజు మిక్స్ డ్ టాక్ బయటకు వచ్చింది. ఇండియన్ సినిమాలో బిగ్గెస్ట్ ఓపెనర్ నిలిచింది. అయితే 2డీలో సినిమా విజువల్స్ అంతగా ఆకట్టుకోలేకపోయినా 3డీ మాత్రం కొత్త అనుభూతిని పంచుతున్నది. సినిమా మాటెలా ఉన్నా దీనిపై నెగెటివ్ రివ్యూస్ ఇచ్చేవారికి ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం గట్టిగానే కౌంటర్లు వేస్తున్నారు. మీమ్స్ తో ట్రోల్ చేస్తున్నారు. అలాగే మీమర్స్ కూడా సినిమా లోని కొన్ని సన్నివేశాలపై ట్రోల్ చేస్తున్నారు.

    ఆదిపురుష్ లో జీసస్ కేమియో..
    ఇందులో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో వచ్చే ఓ సీన్ లో ప్రభాస్ గెటప్ జీసస్ ను పోలి ఉందంటూ మీమర్స్ ట్రోల్ చేస్తున్నారు. జీసెస్ కేమియో ఇన్ ఆదిపురుష్ అంటూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

    దశకంఠుడిపై
    ఇప్పటి వరకు రామాయణం ఆధారంగా తెరకెక్కిన చిత్రాల్లో రావణుడు దశకంఠుడు. పది తలలు ఒకే వరుసలో ఇప్పటి వరకు చూశాం. కానీ ఈ సినిమాలో రెండు వరుసల్లో పది తలలు కనిపించడం మీమర్స్ చేతికి మరింత పని కల్పించినట్లయ్యింది. ఫస్ట్ టీజర్ లో ఒకే వరుసలో ఉన్న తలలు సినిమాలో రెండు వరుసల్లోకి ఎలా వచ్చాయంటూ ట్రోల్ చేస్తున్నారు.

    – ఐకాన్ స్టార్ నూ వదల్లేదు..
    మీమర్స్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నూ వదల్లేదు. అయితే ఇది యాంటీ ఫ్యాన్స్ చేస్తున్నట్లుగా తెలుస్తున్నది. ఇద్దరి హీరోల మధ్య చిచ్చు పెట్టే కుట్రల కనిపిస్తున్నది. ఆదిపురుష్ లో సుగ్రీవుడు పూర్తిగా వానరుడి అవతారంలోనే కనిపిస్తాడు. గతంలో రామాయణం ఆదారంగా వచ్చిన ఏ సినిమాలోనూ సుగ్రీవుడు వానరుడిగా కనిపించలేదు. ఇందులో మాత్రం వానరుడిగానే కనిపించారు. అయితే ఈ పాత్ర కు గ్రాఫిక్స్ లో అల్లుఅర్జున్ ఫొటోను ఆడ్ చేసి ఐకాన్ స్టార్ కేమియో ఇన్ ఆదిపురుష్ అంటూ మీమ్స్ వేస్తున్నారు. మరి ఇది ఏ రకమైన గొడవలకు దారి తీస్తుందో చూడాలి.

    రావణుడి మసాజ్ క్లైమాక్స్ లో వచ్చే ఓ సీన్ లో రావణుడి పాత్ర కొండచిలువలతో మసాజ్ చేయించుకుంటాడు. ఇదెక్కడి వింతరా బాబోయ్ అంటూ మీమర్స్ ట్రోల్ చేస్తున్నారు. కొండచిలువల మధ్య పడుకుని, అతనిపైకి పాకుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రావణుడి యొక్క అసహ్యకరమైన ఎడిటింగ్ మరియు రౌత్ యొక్క విజువలైజేషన్‌పై చాలా మంది అసహ్యం వ్యక్తం చేయగా, మరికొందరు రామాయణం యొక్క అసలు పౌరాణిక కథపై జోక్‌గా ఉందంటున్నారు.

    ఇంకా ఉన్నాయ్
    హనుమంతుడిని సూపర్ మ్యాన్ తో. రావణుడి సైన్యాన్ని లార్డ్ ఆఫ్ రింగ్స్ తో, సుగ్రీవుడిని కింగ్ కాంగ్ తో పొలుస్తూ ట్రోల్ చేస్తున్నారు. రైస్ ఆఫ్ దప్లానెట్ ఏప్స్, హౌస్ ఆఫ్ ద డ్రాగన్ తదితర సినిమాలతో పోలుస్తున్నారు.

    మరోసారి నేనింతే మూవీ సీన్స్
    దర్శకుడు ఓం రౌత్ ను కూడా వదల్లేదు. గ్రాఫిక్స్ పరంగా ఆడుకుంటున్నారు. నేనింతే లో డైరెక్టర్ గా బ్రహ్మనందం ఎపిసోడ్ ను ఓంరౌత్ కు అన్వయిస్తూ వైరల్ చేస్తున్నారు.

    డాక్టర్ రోగినేని ..
    ఓ ప్రముఖ డాక్టర్ చేసిన కామెంట్స్ పై ఫ్యాన్స్ విరుచుకుపడుతున్నారు. పీరియడ్స్ ఉన్న ఆడవాళ్లు ఆదిపురుష్ కు రావచ్చా అని చేసిన కామెంట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. మీమ్స్ తో సదరు డాక్టర్ ను ట్రోల్ చేస్తున్నారు. నీలాగా పీరియడ్స్ ఉన్న పురుషుడు తప్ప ఎవ్వరైనా రావచ్చురా అంటూ వేసిన మీమ్ ఇప్పుడు తెలుగునాట తెగ వైరల్ అవుతుంది.

    -శెనార్తి