Trolls On Adipurush: ఆదిపురుష్ పై మొదలైన ట్రోల్స్… ప్రభాస్ తట్టుకుని నిలబడగలడా?

ఓం రౌత్ థోర్ వంటి హాలీవుడ్ మూవీస్ స్పూర్తితో సైఫ్ అలీ ఖాన్ లుక్ డిజైన్ చేశాడని అంటున్నారు. అసలు సైఫ్ ఏ కోశాన కూడా రావణాసురుడిని తలపించలేదని అంటున్నారు.

Written By: Shiva, Updated On : June 16, 2023 1:14 pm

Trolls On Adipurush

Follow us on

Trolls On Adipurush: ఆదిపురుష్ మూవీ విడుదలకు ముందు ఎన్నో సందేహాలు తలెత్తాయి. ఈ సినిమా ఎలా ఉంటుంది? రాముడిగా ప్రభాస్ మెప్పించగలడా? గ్రాఫిక్స్ ఆకట్టుకుంటాయా? పోలికలను తట్టుకొని నిలబడగలదా? ట్రోల్స్ సినిమాను దెబ్బ తీస్తాయా?… ఇలా అనేక ప్రశ్నలు అందరి మదిలో మెదిలాయి. ఆదిపురుష్ మూవీ నేడు విడుదలైంది. వరల్డ్ వైడ్ ఐదు భాషల్లో అందుబాటులోకి తెచ్చారు. కాగా ఊహించిందే జరిగింది. మొదటి షో పడగానే ఆదిపురుష్ మూవీ మీద ట్రోల్స్ షురూ చేశారు.

ముఖ్యంగా విజువల్స్ బాగా లేవంటూ ధ్వజమెత్తుతున్నారు. అలాగే రాముడిగా ప్రభాస్ మెప్పించలేకపోయాడని అంటున్నారు. గతంలో రాముడు పాత్రలు చేసిన నటులతో ప్రభాస్ ని పోల్చుతూ వారి ముందు తేలిపోయాడని అంటున్నారు. యాంటీ ఫ్యాన్స్ తో పాటు క్రిటిక్స్ కూడా ఈ విషయంలో ఆదిపురుష్ మూవీని టార్గెట్ చేశారు. ఇక లంకేశ్వరుడు గెటప్ ని తీర్చిదిద్దిన తీరును మరింత తప్పుబడుతున్నారు. సైఫ్ అలీ ఖాన్ ఈ పాత్ర చేయగా స్క్రీన్ షాట్స్, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

ఓం రౌత్ థోర్ వంటి హాలీవుడ్ మూవీస్ స్పూర్తితో సైఫ్ అలీ ఖాన్ లుక్ డిజైన్ చేశాడని అంటున్నారు. అసలు సైఫ్ ఏ కోశాన కూడా రావణాసురుడిని తలపించలేదని అంటున్నారు. ఈ ట్రోల్స్ కావాలని చేస్తున్నారా? నిజంగానే సినిమాలో విషయం లేదా? అనే రెండునూ. కొందరు టార్గెట్ చేసి సినిమాపై పూర్తి నెగిటివ్ పుబ్లిసిటీ చేస్తున్నారు. అదే సమయంలో సినిమాలో కూడా లోపాలు ఉన్నాయి.

విజువల్ వర్క్ సగం సగంగా ఉంది. పూర్తి స్థాయిలో విఎఫ్ఎక్స్ వర్క్ లేదు. విడుదల తేదీ టెన్షన్ లో అయినంత వరకు చేసి వదిలారు. అసలు ఆదిపురుష్ టీజర్ విడుదలయ్యాక వినిపించిన మొదటి కంప్లైంట్ నాసిరకం విజువల్స్. ఆరు నెలలు విడుదల వాయిదా వేసి మెరుగులుదిద్దినా ఫలితం లేదని తేలిపోయింది. ఆదిపురుష్ చూసిన పలువురు కంప్లైంట్ ఏంటంటే విజువల్స్ బాగోలేదని. మొత్తంగా ఆదిపురుష్ పై భారీ నెగిటివిటీ నడుస్తుంది. ఈ క్రమంలో ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి.
Recommended Video: