Trivikram Son: తెలుగు సినిమా ఇండస్ట్రీలో రైటర్ గా, దర్శకుడిగా తన సత్తా చాటుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన చేసిన సినిమాలను చూస్తే మనకు అర్థమవుతుంది. వరుసగా ఇండస్ట్రీలో మంచి విజయాలను అందుకొని ఆయన స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందుతున్నాడు. ప్రస్తుతం మహేష్ బాబుతో గుంటూరు కారం అనే సినిమాని తెరకెక్కిస్తున్నాడు.ఇంతకు ముందు ముందు అల్లు అర్జున్ తో చేసిన అలా వైకుంఠపురం లో సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.ఇక ఇప్పుడు గుంటూరు కారంతో మళ్లీ మరోసారి భారీ సక్సెస్ ని సాధించాలని చూస్తున్నాడు.ఇక ఇది ఇలా ఉంటే త్రివిక్రమ్ ఫ్యామిలీకి సంబంధించిన వివరాలను ఎప్పుడు కూడా ఆయన స్క్రీన్ ముందు పంచుకున్న దాఖలాలు లేవు.
ఆయన తన ఫ్యామిలీని కూడా ఎప్పుడు మీడియా ముందుకు తీసుకురాలేదు కానీ ఈ మధ్య ఆయన భార్య అయిన సాయి సౌజన్య సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత అయిన నాగవంశీ తో కలిసి సినిమాలు నిర్మిస్తున్నారు. ఇక అందులో భాగంగానే వీళ్ళ కాంబినేషన్ లో సార్, మాడ్ అనే సినిమాలు వచ్చాయి. ఇక ఇలాంటి క్రమంలో సోషల్ మీడియాలో త్రివిక్రమ్ కొడుకుకి సంబంధించిన ఫోటో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతుంది. అయితే సీతారామశాస్త్రి త్రివిక్రమ్ వాళ్ల భార్య సౌజన్య కి పెద నాన్న అవుతాడు.
ఇక అందులో.భాగంగానే సీతారామశాస్త్రి కొడుకు అయిన రాజా త్రివిక్రమ్ భార్య అయిన సౌజన్య అలాగే త్రివిక్రమ్ కొడుకు అయిన రిషి మనోజ్ లు కలిసి దిగిన ఒక ఫోటో అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయి చూసే ప్రతి ఒక్కరిని అలరిస్తుంది.అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ కి సిరివెన్నెల సీతారామశాస్త్రి మామయ్య అవుతాడు.అయితే రాజా ఇన్ స్టా లో వీళ్ళు ముగ్గురు కలిసి దిగిన ఫోటోని షేర్ చేస్తూ రిషి మనోజ్ ని ట్యాగ్ చేయడం జరిగింది.దాంతో త్రివిక్రమ్ ఫ్యాన్స్ ఆయన కొడుకు ఫోటోని వైరల్ చేస్తూ కటౌట్ తో అద్భుతంగా ఉంది హీరో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
అయితే రిషి మనోజ్ మాత్రం తన డ్రీమ్ హీరో కాదని డైరెక్టర్ అవబోతున్నట్టుగా తెలుస్తుంది. రీసెంట్ గా ఒక సినిమా ప్రమోషన్ లో పాల్గొన్న త్రివిక్రమ్ భార్య సాయి సౌజన్య ఈ విషయం మీద మాట్లాడుతూ రిషి మనోజ్ తొందరలోనే డైరెక్షన్ చేయబోతున్నాడు.ఇక ప్రస్తుతం దానికి సంబంధించిన మెలకువలు నేర్చుకుంటున్నాడు అని చెప్పడం జరిగింది.