కరోనా సెకెండ్ వేవ్ కదా అని సైలెంట్ గా కూర్చుకోలేకపోతున్నాయి బడా నిర్మాణ సంస్థలు. మరి ఏమి చేయాలి ? అని రకరకాల ఆలోచనల్లో ఒక ఐడియా తట్టింది ఓ పెద్ద నిర్మాణ సంస్థకు. ఆ మధ్య ఓటిటిలో రిలీజ్ అయిన ఫ్యామిలీమన్, పాతాళలోక్ లాంటి వెబ్ సిరీస్ లు చక్కగా అన్ని ప్రాంతాల జనాలను చాల బాగా మెప్పించాయి. కాబట్టి అలాంటి వెబ్ సిరీస్ ను తెలుగులో కూడా నిర్మిస్తే ? నిజానికి మంచి వెబ్ సిరీస్ లకు భాషతో పనిలేదు.
సిరీస్ బాగుంటే పాకిస్థాన్ వాడు కూడా చూస్తాడు. ఓటిటీకి ఉన్న ప్లస్ పాయింట్స్ లో ఇది ఒకటి. ఏది ఏమైనా మంచి వెబ్ సిరీస్ తీయాలని టాలీవుడ్ ప్రామినెంట్ నిర్మాణ సంస్థ హారిక హాసిని ప్రయత్నిస్తోందని తెలుస్తోంది. ఇప్పటికే స్క్రిప్ఠ్ వర్క్ కూడా పూర్తయిందని.. ఎనిమిది ఎపిసోడ్స్ గా రానున్న ఈ సిరీస్ ను పాన్ ఇండియా వెబ్ సిరీస్ గా చేస్తారట. ఎలాగూ ఇప్పటికే రైటింగ్ వర్క్ కూడా పూర్తయింది కాబట్టి.. మిగిలిన పనులను సెట్ చేసుకుంటున్నారు.
అన్నిటికిమించి వెబ్ సిరీస్ కి బడ్జెట్ సమస్య గాని, అలాగే స్టార్ కాస్ట్ విషయంలో కూడా ఎలాంటి సమస్యలు ఉండవు.. అవుట్ ఫుట్ విషయంలో కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవ్వొచ్చు. ఇక ఇప్పటికే సిరీస్ కోసం సరైన కథ కథనాలు రాయించడంలో స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కూడా తన సహాయ సహకారాలు అందించాడు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తే.. కచ్చితంగా పాన్ ఇండియా లెవెల్ లో మరో మంచి వెబ్ సిరీస్ వస్తోంది.
ఇక ఇప్పటికే ఈ బడా నిర్మాణ సంస్థ నెట్ ఫ్లిక్స్ లాంటి పెద్ద ఓటిటి నుంచి అప్రూవల్ కూడా తెచ్చుకుంది. స్క్రిప్ట్ చూసిన నెట్ ఫ్లిక్స్ బృందం బాగుంది అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందుకే మే నాలుగో వారం నుండి కరోనా జాగ్రత్తలు తీసుకుంటూనే ఈ సిరీస్ ను మొదలుపెట్టనున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ కూడా అప్రూవల్ అయింది కాబట్టి, టెక్నికల్ కాస్ట్ వగైరా పనులను త్వరగా పూర్తి చేయాలని మేకర్స్ గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు.