https://oktelugu.com/

పవన్ మూవీకి త్రివిక్రమ్ సహకారం.. పారితోషికం ఎంతంటే?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాక పుల్ బీజీగా మారాడు. వరుసగా నాలుగైదు సినిమాలను ప్రకటించి అభిమానుల్లో జోష్ నింపాడు. పవన్ రీ ఎంట్రీ మూవీగా తెరకెక్కుతున్న ‘వకీల్ సాబ్’గా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుండటంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం ఈ మూవీ చివరిదశకు చేరుకోవడంతో ‘వకీల్ సాబ్’ సంక్రాంతి రేసులో ఉందనే ప్రచారం జరుగుతోంది. Also Read: బిగ్ బాస్-4.. అఖిల్ కరివేపాకు.. అభిజిత్ ఊర మాస్.. నెట్టింట్లో గోలగోల..! ‘వకీల్ […]

Written By: , Updated On : November 17, 2020 / 02:16 PM IST
Follow us on

Pawan-kalyan-Trivikram

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాక పుల్ బీజీగా మారాడు. వరుసగా నాలుగైదు సినిమాలను ప్రకటించి అభిమానుల్లో జోష్ నింపాడు. పవన్ రీ ఎంట్రీ మూవీగా తెరకెక్కుతున్న ‘వకీల్ సాబ్’గా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుండటంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం ఈ మూవీ చివరిదశకు చేరుకోవడంతో ‘వకీల్ సాబ్’ సంక్రాంతి రేసులో ఉందనే ప్రచారం జరుగుతోంది.

Also Read: బిగ్ బాస్-4.. అఖిల్ కరివేపాకు.. అభిజిత్ ఊర మాస్.. నెట్టింట్లో గోలగోల..!

‘వకీల్ సాబ్’ తర్వాత పవన్ క్రిష్ దర్శకత్వంలో ఓ మూవీ.. డైరెక్టర్ హరీష్ శంకర్, సురేందర్ రెడ్డిలతో ఓ మూవీని చేయనున్నాడని ప్రచారం జరిగింది. అయితే వీటన్నింటి కంటే ముందుగా పవన్ కల్యాణ్ మరో మూవీ చేయనున్నట్లు తెలుస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో పవన్ కల్యాణ్ ఓ మూవీ చేయబోతున్నట్లు దసరా సందర్భంగా అధికారిక ప్రకటన వచ్చింది. ఈ సినిమానే ముందుగా పట్టాలెక్కనుందని తెలుస్తోంది.

మలయాళంలో సూపర్ హిట్టుగా నిలిచిన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ రీమేక్ ను సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ దక్కించుకుంది. ఇందులోనే పవన్ కల్యాణ్ నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మూవీ కోసం పవన్ కల్యాణ్ నెలన్నర రోజుల కాల్షీట్లు కూడా కేటాయించారట. ఇందులో పవన్ కల్యాణ్  పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తారని తెలుస్తోంది. అప్పట్లో ఒకడుండేవాడు’ ఫేమ్ సాగర్ కె.చంద్ర ఈ మూవీకి దర్శకత్వం వహించనున్నాడు.

Also Read: ఎన్టీఆర్ 20ఏళ్ల సినీ ప్రస్థానం.. కళ్లకుకట్టినట్లు చూపిన సీడీపీ..!

‘అయ్యప్పనుమ్ కోషియమ్’ రీమేక్ మూవీకి దర్శకుడు త్రివిక్రమ్ రచన సహకారం అందించనున్నట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ హ్యాండ్ పడటం వల్లే పవన్ ఈ రీమేక్ మూవీకి ఒప్పుకున్నాడనే టాక్ విన్పిస్తోంది. త్రివిక్రమ్ ఈ మూవీకి సహకారం అందిస్తున్నందుకుగాను ఆయనకే ఏకంగా రూ.10కోట్ల పారితోషికం దక్కనుందట. సినిమా దర్శకుడికి అంత పారితోషికం లేదంటే త్రివిక్రమ్ ఈ మూవీకి ఎంత సహకారం అందిస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు. పవన్ సినిమాకు త్రివిక్రమ్ సమర్పకుడిగా మారడంతో ఈ మూవీపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకుంటున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్