https://oktelugu.com/

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ కోసం 2 కొత్త పాన్ ఇండియన్ సినిమాలను సిద్ధం చేసిన త్రివిక్రమ్..డైరెక్టర్స్ ఎవరో తెలిస్తే మెంటలెక్కిపోతారు!

డిప్యూటీ సీఎం అయ్యాక పవన్ కళ్యాణ్ 'హరి హర వీరమల్లు' సినిమాకి డేట్స్ కేటాయించాడు. ఈ నెలాఖరుతో ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు పూర్తి అవ్వబోతుంది. వచ్చే నెల నుండి 'ఓజీ' మూవీ షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తి అయ్యాక, 'ఉస్తాద్ భగత్ సింగ్' షూటింగ్ ని డిసెంబర్ నెలలో మొదలు పెట్టబోతున్నాడు.

Written By: , Updated On : October 22, 2024 / 09:37 PM IST
Pawan Kalyan-Trivikram

Pawan Kalyan-Trivikram

Follow us on

Pawan Kalyan :  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం డిప్యూటీ సీఎం గా ఒక పక్క రాజకీయాల్లో, అలాగే హీరోగా మరో పక్క సినిమాలు చేస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్న సంగతి అందరికీ తెలిసిందే. తనకు సినిమాల ద్వారా వచ్చిన డబ్బులను తనకంటే ఎక్కువగా జనాల కోసమే ఉపయోగించడం పవన్ కళ్యాణ్ నైజం. అధికారం లోకి వచ్చిన తర్వాత కూడా ఆయన వివిధ సందర్భాలలో ఆంధ్ర ప్రదేశ్ లో ఏర్పడిన కొన్ని విపత్కర సంఘటనలకు తనవంతుగా 10 కోట్ల రూపాయిల వరకు డొనేషన్స్ చేసాడు. అలా సినిమాలకు అడ్వాన్స్ తీసుకుంటాడు, ఇలా జనాల కోసం ఖర్చు పెట్టేస్తాడు. మరోపక్క తన సొంత కష్టార్జీతం మీదనే జనసేన పార్టీ ని నడపాలి. అందుకే ఆయన రాజకీయంగా ఎంతటి ఉన్నత స్థాయిలో ఉన్నప్పటికీ కూడా సినిమాలను వదలలేడు. ప్రస్తుతం ఆయన చేతిలో ‘ఓజీ’, ‘హరి హర వీరమల్లు’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ వంటి చిత్రాలు ఉన్నాయి.

ఈ మూడు సినిమాలు 50 శాతం కి పైగా షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్నాయి. డిప్యూటీ సీఎం అయ్యాక పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ సినిమాకి డేట్స్ కేటాయించాడు. ఈ నెలాఖరుతో ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు పూర్తి అవ్వబోతుంది. వచ్చే నెల నుండి ‘ఓజీ’ మూవీ షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తి అయ్యాక, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్ ని డిసెంబర్ నెలలో మొదలు పెట్టబోతున్నాడు. ఈ మూడు సినిమాల తర్వాత పవన్ కళ్యాణ్ ఏమి చేయబోతున్నాడు అనేది ఇప్పుడు అభిమానుల్లో మెలుగుతున్న ప్రశ్న. పవన్ కళ్యాణ్ కి అత్యంత సన్నిహితుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, పవన్ కళ్యాణ్ కి సంబంధించిన అన్ని సినిమాలు సెట్ చేసే పనిలో గత 5 ఏళ్ళ నుండి చేస్తున్న సంగతి తెలిసిందే. ‘వకీల్ సాబ్’, ‘భీమ్లా నాయక్’, ‘బ్రో’ వంటి చిత్రాలు ఆయన సెట్ చేసి పెట్టినవే.

అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్న ‘ఓజీ’ చిత్రాన్ని కూడా త్రివిక్రమే సెట్ చేసాడు. ఇప్పుడు మరో రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ ని కూడా లైన్ లో పెట్టినట్టు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్, అట్లీ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కబోతుంది అనే విషయం చాలా కాలం నుండి సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ కథని అందించబోతున్నాడు. ఈ క్రేజీ కాంబినేషన్ ని పవన్ కళ్యాణ్ తో సెట్ అయ్యేలా చేసింది త్రివిక్రమే, అలాగే సౌత్ ఇండియన్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తో కూడా రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా చేయనున్నాడు. ఈ చిత్రానికి కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ కథని అందించబోతున్నాడు. ఈ రెండు ప్రాజెక్ట్స్ 2027 వ సంవత్సరం లో సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. త్వరలోనే వీటికి సంబంధించి మరికొన్ని వివరాలు స్పష్టం గా తెలిసే అవకాశం ఉంది.