
Trivikram- Mahesh Babu: టాలీవుడ్ టాప్ 2 డైరెక్టర్స్ లో ఒకడైన త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎంతమంది టాప్ హీరోలతో అయినా పని చేస్తూ ఉండొచ్చు, కానీ ఆయన మనసులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న స్థానం మాత్రం ఉన్నతమైనది అనే విషయం అందరికీ తెలుసు.రీ ఎంట్రీ తర్వాత పవన్ కళ్యాణ్ కి రెండు విజయవంతమైన సినిమాలు రావడానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ పాత్ర చాలా ఉంది.వకీల్ సాబ్ సినిమా చెయ్యమని సలహా ఇచ్చింది ఆయనే.
ఈ చిత్రం పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఎంత కీలకంగా మారిందో అందరికీ తెలుసు, ఫ్యామిలీ ఆడియన్స్ లో ఆయన ఇమేజి ని శిఖరాగ్ర స్థాయికి తీసుకెళ్లింది ఈ చిత్రం.ఆ సినిమా తర్వాత ‘భీమ్లా నాయక్’ చిత్రానికి మాటలు మరియు స్క్రీన్ ప్లే అందించాడు..ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్ కి రీచ్ కాకపోయినా మాస్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యింది.
ఫలితంగా అతి తక్కువ టికెట్ రేట్స్ మీద కూడా వంద కోట్ల రూపాయిల షేర్ మార్కుని సాధించిన సినిమాగా నిలిచింది..ఇప్పుడు అతి త్వరలోనే తమిళం లో సూపర్ హిట్ గా నిలిచినా ‘వినోదయ్యా సీతం’ రీమేక్ లో పవన్ కళ్యాణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే..ఇందులో ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా నటిస్తున్నాడు..ఈ సినిమాకి కథ , మాటలు మరియు స్క్రీన్ ప్లే బాధ్యతలను త్రివిక్రమ్ తీసుకున్నాడు.మరోపక్క సూపర్ స్టార్ మహేష్ బాబు తో ఆయన ఒక సినిమా చేస్తున్నాడు.

ఒక సినిమాకి దర్శకత్వం వహిస్తూ మరో సినిమా లో తలదూరిస్తే ఫలితం ఎక్కడ తారుమారు అవుతుందో అని ఫ్యాన్స్ భయపడుతూన్నారు.నీ స్నేహితుడి సినిమా కోసం దయచేసి మా హీరో సినిమాని గాలికి వదిలేయొద్దు అంటూ త్రివిక్రమ్ ని బ్రతిమిలాడుకుంటున్నారు మహేష్ ఫ్యాన్స్.మరి త్రివిక్రమ్ ఈ రెండు సినిమాలను ఎలా బ్యాలెన్స్ చేస్తాడో చూడాలి.