Pawan Kalyan: పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని చాలా ట్రై చేసి నిరాశ చెందిన స్టార్ హీరోయిన్…

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, మహేష్ బాబు, శ్రీకాంత్ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించింది.

Written By: Gopi, Updated On : March 8, 2024 10:03 am

Pawan Kalyan

Follow us on

Pawan Kalyan: సినిమా ఇండస్ట్రీలో ఉన్న నటులు ఎంతమందితో సినిమాలు చేసిన కూడా రాని గుర్తింపు పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమాలో హీరోయిన్ గా నటిస్తే చాలు ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ అయిపోవచ్చు అని చాలామంది హీరోయిన్లు ఆయనతో ఒక సినిమా చేయడానికి విపరీతమైన ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. ఇక ఇలాంటి క్రమం లోనే కొంతమందికి ఆయనతో చేసే అవకాశాలు వస్తే, మరి కొంతమందికి మాత్రం ఆయన సినిమాలో చేసే అవకాశం రాకపోవడం నిజంగా వాళ్ళ దురదృష్టమనే చెప్పాలి.

ఇక ఇదే కొవకు చెందిన ఒక హీరోయిన్ పవన్ కళ్యాణ్ తో దాదాపు వరుసగా ఐదు సినిమాల్లో హీరోయిన్ గా నటించాలని ఉత్సాహాన్ని చూపించినప్పటికీ స్క్రిప్ట్ డిమాండ్ వల్లనో, లేదా డైరెక్టర్లు ఆ స్టోరీ కి ఆమె సెట్ అవ్వదు అనే కారణం చేతనో కానీ ఆ హీరోయిన్ కి మాత్రం ఇప్పటివరకు ఆయన సినిమాల్లో నటించే అవకాశం అయితే రాలేదు. ఇక ఆమె ఎవరు అంటే ఒకప్పటి స్టార్ హీరోయిన్ అయిన సోనాలి బింద్రే… ఈమె తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, మహేష్ బాబు, శ్రీకాంత్ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించింది. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ తో కొన్ని సినిమాల్లో నటించే అవకాశం వచ్చినప్పటికీ చివరి వరకు ఆమెకి మాత్రం ఆ అవకాశం దక్కకుండా పోయింది. ఇక ఆమె ఎదురుచూసిన కూడా పవన్ కళ్యాణ్ తో నటించే అవకాశం అయితే రాలేదు.

ఇక ఆ తర్వాత ఆమె కి వరుసగా ప్లాప్ లు రావడంతో ఆమె ఇండస్ట్రీ నుంచి ఫేడౌట్ అయిపోయింది. అలా పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తే చాలు అనుకున్న హీరోయిన్లు చాలామంది ఉన్నారు. కానీ కొంతమందికి మాత్రమే అవకాశం దొరికితే, మరి కొత్త మందికి ఇక్కడ అవకాశం దొరకడం లేదు. మరి సోనాలి బింద్రే సెకండ్ ఇన్నింగ్స్ లో అయిన పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటిస్తుందా లేదా అనే విషయాలు తెలియాల్సి ఉంది.