Trivikram Next Movie With NTR Or Allu Arjun: నువ్వే నువ్వే (Nuvve Nuvve) సినిమాతో దర్శకుడిగా మారి ఆ తర్వాత వరుస విజయాలను అందుకుంటూ ముందుకు సాగుతూ వచ్చాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు. అయితే ఎన్టీఆర్ తో ఈయన సినిమా ఉంటుంది అంటూ ప్రొడ్యూసర్ నాగవంశీ అనౌన్స్ చేసిన విషయం మనకు తెలిసిందే. అల్లు అర్జున్ (Allu Arjun) తో కూడా మరొక సినిమా ఉండబోతుంది అనే వార్తలైతే వస్తున్నాయి. మరి ఈ ఇద్దరిలో ఆయన ఎన్టీఆర్ తో ముందు సినిమా చేసి ఆ తర్వాత అల్లు అర్జున్ తో చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. నిజానికి పుష్ప 2 (Pushpa 2) సినిమా తర్వాత అల్లు అర్జున్ తో ఆయన ఒక భారీ సినిమా చేయాల్సి ఉంది. కానీ అనుకోని కారణాలవల్ల ఆ సినిమా పట్టాలెక్కలేదు. ప్రస్తుతం అల్లు అర్జున్ (Allu Arjun) అట్లీ (Atlee) డైరెక్షన్లో సినిమా చేస్తున్నాడు. ఇక అల్లు అర్జున్ తో చేయాలనుకున్న సినిమా కథని ఎన్టీఆర్ తో చేయబోతున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ప్రస్తుతం త్రివిక్రమ్ వెంకటేష్ (Venkatesh) తో ఒక కామెడీ ఎంటర్ టైనర్ ను తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పూర్తయిన వెంటనే ఎన్టీఆర్ తో సినిమా స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఇక ఆ తర్వాత అల్లు అర్జున్ తో చేయబోయే సినిమా ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు వహిస్తూ ముందుకు సాగుతున్నాడు. త్రివిక్రమ్ కి సంబంధించి సోషల్ మీడియాలో ఒక వీడియో అయితే వైరల్ అవుతోంది.
ఒకవైపు అల్లు అర్జున్, మరొకవైపు ఎన్టీఆర్ ఉండి త్రివిక్రమ్ ను అటు ఇటు తోస్తున్నారు. ఇక మధ్యలో రామ్ చరణ్ కూడా రావడం విశేషం…ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇక దీన్ని చూసి కొంతమంది త్రివిక్రమ్ అభిమానులు కొంత వరకు నిరాశను వ్యక్తం చేస్తున్నప్పటికి ప్రస్తుతం త్రివిక్రమ్ పరిస్థితి అలాగే ఉందనే వార్తలైతే వస్తున్నాయి.
ఇక మైథాలజికల్ కథకు ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికి త్రివిక్రమ్ ఆ సబ్జెక్టుని ఎంతవరకు సక్సెస్ ఫుల్ గా డీల్ చేస్తాడు అనేది తెలియాల్సి ఉంది. ఎందుకంటే త్రివిక్రమ్ ఇంతకుముందు ఎప్పుడు పెద్దగా గ్రాఫిక్స్ ఓరియెంటెడ్ సినిమాలైతే చేయలేదు. ఆయన చేసిన సినిమాలన్నీ కమర్షియల్ జానర్ లోనే తెరకెక్కాయి. ఇక మైథిలాజికల్ సినిమా అంటే కమర్షియల్ హంగులతో కాకుండా గ్రాఫికల్ వర్క్స్ తో ఉంటాయి.
కాబట్టి వాటిని ఆయన సక్సెస్ ఫుల్ గా హ్యాండిల్ చేస్తాడా? లేదా అనే ఒక డైలామాలో జూనియర్ ఎన్టీఆర్ అయితే ఉన్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికైతే ఎన్టీఆర్ ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ ఆయన కొత్త వరకు కన్ఫ్యూజన్ లో ఉన్నాడనే వార్తలైతే వస్తున్నాయి…