Trivikram: చాలామంది రచయితలు దర్శకులుగా మారి మంచి సక్సెస్ లను అందుకుంటూ వాళ్ళకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ను అయితే ఏర్పాటు చేసుకుంటారు.ఇక ఇలాంటి క్రమంలోనే ఇండస్ట్రీకి మొదట రచయితగా వచ్చిన త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆ తర్వాత దర్శకుడుగా మారి పలు చిత్రాలను తీశాడు. ఇక అందులో భాగంగా ఈయన రైటర్ గా ఉన్నప్పుడు వెంకటేష్ తో చేసిన నువ్వు నాకు నచ్చావ్ సినిమాకి కథ మాటలు అందించడమే కాకుండా ఆ సినిమా సూపర్ సక్సెస్ అవ్వడంలో తను కీలకపాత్ర వహించాడు. ఇక ఆ సినిమా తర్వాత వీళ్ల కాంబినేషన్ లో మల్లీశ్వరి అనే సినిమా వచ్చింది. అయితే ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయింది.
ఈ రెండు చిత్రాలకు త్రివిక్రమ్ కథ మాటలు అందించి సినిమాను సక్సెస్ చేసే దిశగా ముందుకు తీసుకెళ్లాడు.ఇక వెంకటేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఎప్పటినుంచో నువ్వు నాకు నచ్చావు కి సీక్వెల్ గా ఒక సినిమా వస్తుంది అంటూ చాలామంది అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఎప్పటికప్పుడు ఈ న్యూస్ తెర మీదకి వస్తున్నప్పటికీ మళ్లీ డిలే అవుతూ వస్తుంది. అయితే త్రివిక్రమ్ గుంటూరు కారం సినిమా తర్వాత అల్లు అర్జున్ తో సినిమా చేయాల్సి ఉంది. ఈ సినిమా చేయాలంటే ముందు అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాని పూర్తి చేయాలి కాబట్టి త్రివిక్రమ్ అప్పటివరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది.
ఇక అందులో భాగం గానే తన దగ్గర వెంకటేష్ కోసం రాసుకున్న స్క్రిప్ట్ ని ఈ గ్యాప్ లో సినిమాగా తెరకెక్కించాలని చూస్తున్నారు. అయితే ఈ సినిమాలో వెంకటేష్ ఒక్కడే కాకుండా ఈ సినిమాని మల్టీ స్టారర్ సినిమా తీర్చిదిద్దాలని త్రివిక్రమ్ చూస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో వెంకటేష్ తో పాటు నాని కూడా నటించే అవకాశం ఉంది.
ఇక ఈ స్టోరీ కి వీళ్లిద్దరి క్యారెక్టర్స్ ని బాగా డిజైన్ చేసుకున్న త్రివిక్రమ్ ఈ సినిమాని కామెడీ సినిమాగా మన ముందుకు తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాడు.మరి ఈ సినిమా తెరకెక్కుతుంది అనేది ఇంకా క్లారిటీగా తెలియదు గానీ ఈ సినిమా మాత్రం పక్కాగా ఉంటుంది అనే న్యూస్ మాత్రం ఫిలింనగర్ సర్కిల్లో చెక్కర్లు కొడుతుంది.ఇక ఇప్పటికే త్రివిక్రమ్ వాళ్ళిద్దరికీ కథ కూడా వినిపించినట్టుగా టాకైతే వస్తుంది. కానీ ఈ విషయాన్ని ఎక్కడ బయట పెట్టకూడదని ఉద్దేశ్యం తోనే అందరూ రహస్యం గా ఉంచినట్టు గా తెలుస్తుంది..