
Trivikram-Mahesh Movie: సూపర్ స్టార్ మహేష్ బాబుతో త్రివిక్రమ్ పాన్ ఇండియా సినిమా చేయడానికి ప్రస్తుతం కసరత్తులు చేస్తున్నాడు. కాగా తాజాగా ఈ సినిమా షూటింగ్ డేట్ కూడా ఫిక్స్ అయింది. నవంబర్ 4వ తేదీ నుంచి రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ ప్రత్యేక సెట్ లో మహేష్ పై ఓ సోలో సాంగ్ ను కూడా షూట్ చేయనున్నారు.
ఆ సాంగ్ పూర్తి అయ్యాక, ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్, మహేష్ అండ్ విలన్స్ పై ఒక ఫైట్ ను కంపోజ్ చేయనున్నారు. ఇక ఈ సినిమా సంగీత చర్చలు కూడా ఇప్పటికే స్టార్ట్ అయ్యాయి. సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్ తో త్రివిక్రమ్ గత పదిరోజుల నుంచి మ్యూజిక్ సిట్టింగ్స్ పై కూర్చున్నారు.
అయితే, వీరిద్దరూ కలిసి ఒక సాంగ్ ను కూడా ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. తన ప్రతి సినిమాలో ఓ ప్రత్యేక సాంగ్ డిజైన్ చేయడం త్రివిక్రమ్ కి బాగా అలవాటు. ఈ క్రమంలోనే ఈ సాంగ్ ను ఓకే చేశారు. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. రాజకీయ నేపథ్యంలో సాగే భారీ యాక్షన్ డ్రామాగా ఈ సినిమాని తీయాలనేదే త్రివిక్రమ్ ప్లాన్.
మరి త్రివిక్రమ్ కి పెద్దగా యాక్షన్ మూవీ వర్కౌట్ అవదు, కాబట్టి మహేష్ తో ఫుల్ యాక్షన్ మూవీ చేయడం కరెక్ట్ కాదు అని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కాకపోతే, త్రివిక్రమ్ మాత్రం పక్కా యాక్షన్ సినిమాగానే మహేష్ సినిమాని తీర్చిదిద్దాలని నిర్ణయించుకున్నాడు.
అయితే త్రివిక్రమ్ నుంచి గొప్ప కామెడీ సినిమా వస్తే బాగుంటుందని ఎప్పటి నుంచో ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.