Trivikram And Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న ఆయన ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం గా తన పదవి బాధ్యతలను కొనసాగిస్తూ ముందుకు సాగుతున్నాడు…రాజకీయంగా ఆయన చాలా బిజి గా ఉన్నప్పటికి అభిమానులను నిరాశపర్చకూడదనే ఉద్దేశ్యంతో ఖాళీ సమయం దొరికిన ప్రతీసారి సినిమాలను చేస్తు అభిమాలను, ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఈ సంవత్సరం హరిహర వీరమల్లు, ఓజి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన 2026వ సంవత్సరంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నాడు…ఇక ప్రస్తుతం మరో రెండు సినిమాలకు కూడా కమిట్ అవ్వాలనే ప్రయత్నంలో ఉన్నాడు. దీనికి సంబంధించిన స్క్రిప్ట్ పనులను త్రివిక్రమ్ చూసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే లోకేష్ కనకరాజు లాంటి దర్శకుడు సైతం పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడానికి త్రివిక్రమ్ ను కలిసి ఒక కథను కూడా వినిపించాడు.
మరి ఆ కథ ఫైనల్ అయిందా? లేదా అనేది తెలియాల్సి ఉంది. అతనితోపాటుగా తెలుగులో స్టైలిష్ డైరెక్టర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న సురేందర్ రెడ్డి సైతం పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడానికి గత రెండు మూడు సంవత్సరాలు నుంచి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు.
తను కూడా త్రివిక్రమ్ కి కథను వినిపించారట. ఇక త్రివిక్రమ్ ఈ ఇద్దరి దర్శకులలో ఎవరిని ఫైనల్ చేస్తాడు అనేది తెలియాల్సి ఉంది. దిల్ రాజు బ్యానర్లో పవన్ కళ్యాణ్ ఒక సినిమా చేయాల్సి ఉంది. దానికి అనిల్ రావిపూడి డైరెక్షన్ చేస్తాడు అంటూ కొన్ని వార్తలైతే వస్తున్నాయి.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఏ సినిమాకి కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వలేదు. త్రివిక్రమ్ ఎవరినైతే ఫైనల్ చేస్తాడో పవన్ కళ్యాణ్ వాళ్లకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలైతే ఉన్నాయి… పవన్ కళ్యాణ్ తన స్టార్ డమ్ ని విస్తరించుకుంటూ మరిన్ని సక్సెస్ లను సాధిస్తూ ఇటు సినిమాల పరంగాను రాజకీయంగా ఒకేసారి రెండు రకాలుగా ముందుకు దూసుకెళ్తాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది…