Pan India Number One Hero: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తుంది. పాన్ ఇండియాలో మన స్టార్ హీరోలు చేస్తున్న వరుస సినిమాలు సూపర్ సక్సెస్ లను సాధించడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని మెప్పిస్తున్నాయి. బాలీవుడ్ ప్రేక్షకులు సైతం మన తెలుగు హీరోల సినిమాల కోసం ఆసక్తి ఎదురుచూస్తున్నారు అంటే మన వాళ్ళు ఎలాంటి ఘనతను సాధించారో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మన సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరో ఎవరు అనేదానిమీద గత కొన్ని రోజులుగా చాలా చర్చలైతే జరుగుతున్నాయి. ఇప్పటికే ప్రభాస్ సినిమా ఇండస్ట్రీ నెంబర్ వన్ గా కొనసాగుతున్నాడు అంటూ కొంతమంది చెబుతుంటే వారణాసి సినిమా రిలీజ్ అయిన తర్వాత మహేష్ బాబు అన్ని రికార్డులను బ్రేక్ చేసి ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా మారుతాడు అంటూ మరి కొంతమంది కామెంట్ చేస్తున్నారు.
ఈ సినిమా సక్సెస్ అయితే మహేష్ సైతం తన సత్తా చాటుతాడు. మొత్తానికైతే తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచే పాన్ ఇండియాలో నెంబర్ వన్ హీరోగా ఎవరో ఒకరు రాబోతున్నారనేది క్లారిటీగా తెలిసిపోతుంది. ఎందుకంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న టాప్ 5 హీరోలందరు పాన్ ఇండియాలో తమ సత్తా చాటుతున్న వాళ్లే కావడం విశేషం….
ప్రభాస్, మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి నటులు ఇప్పటికే పాన్ ఇండియాలో పెను ప్రభంజనాలను సృష్టించారు. ఇక రాబోతున్న సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రతి ఒక్కరు భారీ బడ్జెట్ తో సినిమాలను చేస్తూ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మీద కొత్త రికార్డులను క్రియేట్ చేయాలనే ప్రయత్నంలో ఉన్నారు…
ఎవరు ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో నెంబర్ వన్ హీరోగా మారతారనేది తెలియాలంటే మరో రెండు సంవత్సరాల పాటు వేచి చూడాల్సిన అవసరమైతే ఉంది. ఎందుకంటే ఇప్పుడిప్పుడే మన హీరోలందరు పాన్ ఇండియా బాట పట్టారు. ఇంకో కాబట్టి ఇంకో మూడు నాలుగు సినిమాలు చేస్తే గాని పాన్ ఇండియాలో ఎవరి సత్తా ఏంటి అనేది తెలియదు. కాబట్టి మరో రెండు మూడు సంవత్సరాల పాటు వేచి చూడాల్సిన అవసరమైతే ఉంది…