OG Movie Trivikram: సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వడం అంత ఆషామాషీ వ్యవహారమైతే కాదు… చాలామంది నటులు సక్సెస్ లను సాధించడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే కొంతమందికి మంచి విజయాలు దక్కితే, మరి కొంతమంది మాత్రం ప్లాపులను మూటగట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. పవన్ కళ్యాణ్ సైతం గత కొన్ని సంవత్సరాలుగా చేస్తున్న సినిమాలన్నీ ఫ్లాప్ అవుతున్నాయి. ఇక ఇప్పుడు సుజీత్ దర్శకత్వంలో వచ్చిన ఓజీ సినిమా రీసెంట్ గా రిలీజ్ అయింది. ఇక ఈ సినిమా మొదటి షో తోనే పాజిటివ్ టాక్ సంపాదించుకొని ముందుకు దూసుకెళ్తూ ఉండడం విశేషం… ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఏ సినిమా చేసిన కూడా ఆ సినిమాకు సంబంధించిన బాధ్యతలను త్రివిక్రమ్ చూసుకుంటున్నాడు… దానికి సంబంధించిన కథ మాటలు ఎలా ఉండాలి, ఆ మూవీకి ఆయన ఎన్ని డేట్లను కేటాయించాలి.
ఎప్పుడు ఎలాంటి సన్నివేశాలను చిత్రీకరించాలి అనే విషయాలన్నింటిని త్రివిక్రమ్ హ్యాండిల్ చేస్తున్నాడు. అలా ఓజీ సినిమాని కూడా త్రివిక్రమే సెట్ చేశాడు. అయితే ఓజీ సినిమా కథలో అర్జున్ దాస్ ఎపిసోడ్ గాని, చిన్నప్పుడు వాళ్ళ ఫాదర్ ను అర్జున్ దాస్ చంపి పవన్ కళ్యాణ్ చంపాడనుకొని అతని మీద రివెంజ్ తీర్చుకోవాలనుకుంటాడు.
అలాంటి సన్నివేశాలను త్రివిక్రమే ఆడ్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇది సినిమాలో కీలకమైన సీన్ కాబట్టి ఆయన ఈ సినిమాలో కథ ఉండాలనే ఉద్దేశ్యంతో ఇలాంటి కొన్ని సన్నివేశాలను రాశారట. నిజానికి అర్జున్ దాస్ ఎపిసోడ్ ఈ సినిమాకి అవసరం లేదు.
దాని బదులు వేరే సీను రాసుకొని ఉంటే బాగుండేది అని కొంతమంది సినిమా మేధావులు వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. మొత్తానికైతే పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాతో ఒక సూపర్ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక రాబోయే రోజుల్లో ఈ సినిమా ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తోంది అనేది తెలియాల్సి ఉంది…ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అభిమానులు ఆ సినిమా ఇచ్చిన హై లో ఎంజాయ్ చేస్తున్నారు…