Trivikram: సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన థియేటర్లలోకి రాబోతున్న గుంటూరు కారం సినిమాకు సంబంధించిన ప్రి రిలీజ్ ఈవెంట్ ఇవాళ్ల గుంటూరులో ఘనంగా నిర్వహించారు. అయితే ఈ ఈవెంట్ లో డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ గుంటూరు కారం సినిమా తీశాం కాబట్టి ఈవెంట్ ని గుంటూరులో సెలబ్రేట్ చేయడానికి ఇక్కడికి వచ్చాం. ఈ సినిమాలోని హీరో అయిన రమణ గాడు మీ మనిషి, మనందరి మనిషి కాబట్టి ఈవెంట్ ని కూడా మనందరి మధ్యలో జరుపుకోవాలని ఇక్కడికి వచ్చాం… అంటూ గుంటూరు ప్రజల గురించి చాలా బాగా చెప్పాడు. ఇక అలాగే కృష్ణ గారి గురించి చెబుతూ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఆయన ఒక మెయిన్ పిల్లర్ అయిన లేని ఇండస్ట్రీ ని ఊహించడం కష్టం.
నాకు కృష్ణ గారితో డైరెక్ట్ గా పని చేసే అవకాశం రాలేదు. కానీ ఆయన హీరోగా చేస్తున్నప్పుడు పోసాని కృష్ణమురళి గారి దగ్గర నేను అసిస్టెంట్ రైటర్ గా ఉన్నపుడు ఆయనతో కొన్ని మధురమైన క్షణాలను గడిపే అవకాశం అయితే నాకు వచ్చింది. ఇక అలాగే అతడు, ఖలేజా సినిమాలు చేస్తున్న టైంలో కూడా కృష్ణ గారిని కలిసి ఆయనతో మాట్లాడాను ఇప్పటికి కూడా నాకు ఆ మూమెంట్స్ చాలా గుర్తున్నాయి. ఇక మహేష్ బాబు సూపర్ స్టార్ కృష్ణ గారి లెగసి ని ముందుకు తీసుకెళ్లే తన నట వారసుడు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఒక సీన్ కి 100% కావాలంటే 200% ఎఫర్ట్ పెట్టే ఏకైక తెలుగు హీరో మహేష్ బాబు ఆయన లా చేసే నటుడు తెలుగు ఇండస్ట్రీలో ఎవరు లేరు అని ఆయనతో పనిచేసిన ప్రతి ఒక్కరు గర్వంగా చెప్పుకుంటారు.
అయితే మహేష్ బాబు ఇండస్ట్రీకి వచ్చి 25 సంవత్సరాలు అవుతుంది కానీ నాకు మాత్రం రెండు, మూడు సంవత్సరాలు అవుతున్నట్టుగా ఉంది. ఆయనతో అతడు సినిమా చేసినప్పుడు తను ఎలా ఉన్నాడో? ఖలేజా సినిమా చేసినప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు. బిహేవియర్ లో గానీ, అందం లో గానీ ఎలాంటి మార్పు లేదు. ఇక యాక్టింగ్ విషయానికి కొత్త నటుడు ఎలాగైతే ఏదైనా చేసేయాలనే ఒక కాన్ఫిడెంట్ తో ఎలాగైతే ఉంటాడో మహేష్ బాబు కూడా ఇప్పటికి నటనపరంగా చాలా కాన్ఫిడెంట్ ని వ్యక్తం చేస్తూ నటిస్తూ ఉంటాడు.
ఇలా మహేష్ బాబు గురించి చాలా అద్భుతంగా చెప్పాడు. ఇక గుంటూరు కారం సినిమా జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తుంది కాబట్టి మన రమణ గాడిని మనం థియేటర్ లో చూసి ఎంజాయ్ చేద్దాం అని తను స్పీచ్ ని ముగించాడు…