Trivikram : తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాటల మాంత్రికుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas)… ఒకప్పుడు ఆయన రైటర్ గా మంచి విజయాలను అందుకోవడమే కాకుండా ఆయనకంటూ ఒక గొప్ప గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆ తర్వాత డైరెక్టర్ గా కారి మంచి విజయాలను సాధించాడు. ఇక ప్రస్తుతం చేయబోయే సినిమాలతో సూపర్ డూపర్ సక్సెస్ లను సాధించాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. గత సంవత్సరం వచ్చిన ‘గుంటూరు కారం’ సినిమా ఆశించే మేరకు విజయాన్ని సాధించలేదు. దాంతో ఆయన కొంతవరకు వెనకబడ్డాడనే చెప్పాలి. ప్రస్తుతం అల్లు అర్జున్ తో సినిమా చేయాల్సి ఉన్నప్పటికి త్రివిక్రమ్ కి పాన్ ఇండియాలో మార్కెట్ లేదనే ఒకే ఒక కారణంతో అల్లు అర్జున్ త్రివిక్రమ్ ను పక్కన పెట్టినట్టుగా తెలుస్తోంది. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ తో సినిమా చేస్తున్నాడు. అయితే త్రివిక్రమ్ ప్రస్తుతం ఎవరితో సినిమా చేయాలి అనే డైలామాలో ఉన్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. మరి ఏది ఏమైనా కూడా త్రివిక్రమ్ పేరు చెబితే ఒకప్పుడు స్టార్ హీరోలు సైతం డేట్స్ ఇచ్చేవారు. కానీ ఇప్పుడు రోజులు మారిపోయాయి. ప్రస్తుతానికి అతను ఫ్లాప్ ల్లో ఉన్నాడు. దానికి తోడుగా ఆయనకు పాన్ ఇండియాలో మార్కెట్ అయితే లేదు. మరి ఆ రెండింటితో పూర్తిగా వెనుకబడిపోయాడు. ఇప్పుడు ఒక మంచి కథతో పాన్ ఇండియాలో తనను తాను ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
Also Read : అల్లు అర్జున్ త్రివిక్రమ్ కి హ్యాండ్ ఇవ్వడం అతని అభిమానులను ఇబ్బంది పెడుతుందా..?
మరి ఈ సినిమాతో ఆయన ఎంతవరకు సక్సెస్ ని సాధిస్తాడు. ఆయనకు ఒక ప్రత్యేకమైన ఐడెంటిటి క్రియేట్ అవుతుందా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఇప్పుడు ఆయన ఒక మీడియం రేంజ్ హీరోతో సూపర్ సక్సెస్ ని సాధించాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. దాని కోసమే విజయ్ దేవరకొండ ను తను ఎంచుకున్నట్టుగా వార్తలయితే వస్తున్నాయి.
గతంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఒక సినిమా ఈవెంట్ కు వచ్చిన త్రివిక్రమ్ విజయ్ గురించి చాలా గొప్పగా మాట్లాడాడు. ఇక వీళ్లిద్దరి మధ్య మంచి బాండింగ్ అయితే ఉంది. త్రివిక్రమ్ తో సినిమా చేయాలని విజయ్ కూడా చాలా సంవత్సరాల నుంచి ఎదురుచూస్తున్నాడట. అయినప్పటికి త్రివిక్రమ్ చాలా బిజీగా ఉండడం వల్ల వీళ్ళిద్దరి కాంబినేషన్ లో సినిమా ఏది సెట్ అవ్వలేదు.
కానీ ఇప్పుడు మాత్రం ఒక భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ ను తెరకెక్కించాలనే ఉద్దేశంతో ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ దర్శకత్వంలో వస్తున్న కింగ్ డమ్ (Kingdom) సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన తర్వాత ఆయన త్రివిక్రమ్ తో సినిమా చేసే అవకాశాలైతే ఉన్నాయి.
Also Read : వెంకటేష్ త్రివిక్రమ్ కాంబోలో ‘నువ్వు నాకు నచ్చావ్ 2’ చేయబోతున్నారా..?