Trivikram And Venkatesh: మాటల మాంత్రికుడిగా తనకంటూ గొప్ప గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు త్రివిక్రమ్…తన సినిమాల్లో పెద్దగా కథలు లేనప్పటికీ మాటలతో గారడీ చేస్తూ ప్రేక్షకులను లారిస్తుంటాడు. తన దర్శకత్వంలో వచ్చిన సినిమాలన్నీ కూడా సూపర్ సక్సెస్ గా నిలవడమే కాకుండా అతనికి సక్సెస్ పర్సెంటేజ్ కూడా విపరీతంగా పెరిగిపోయింది. ఇక దాంతో ఆయన నుంచి వచ్చే సినిమాలకు ఆదరణ పెరిగింది. ప్రతి హీరో అతనితో సినిమాలు చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన ఇప్పుడు వెంకటేష్ తో ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ సబ్జెక్టుని డీల్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు ఒకెత్తయితే ఇప్పుడు వెంకటేష్ తో చేస్తున్న సినిమాతో మరో సక్సెస్ ను తన ఖాతాలో వేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక తను అనుకుంటున్నట్టుగానే ఈ సినిమాతో గొప్ప విజయాన్ని సాధిస్తే మాత్రం త్రివిక్రమ్ పేరు మరోసారి త అఫ్ ది టౌన్ గా నిలుస్తోంది. ఒకప్పుడు తను కామెడీ సినిమాలు చేశాడు. కానీ ఇప్పుడు మాత్రం డిఫరెంట్ జానర్స్ లో సినిమాలను చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. ఇక హాలీవుడ్ స్థాయిలో తెలుగు సినిమాలను తీర్చిదిద్దాలనే ప్రయత్నంలో తను ఉన్నాడు.
ఇక తను అనుకున్నట్టుగానే ఇప్పుడు వెంకటేష్ తో చేస్తున్న సినిమాలో మరోసారి తన సెంటిమెంట్ ను రిపీట్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి ని హీరోయిన్ గా తీసుకున్నారు. తను ఈ సినిమాకి చాలా యాప్ట్ గా సెట్ అయిందని త్రివిక్రమ్ పలు సందర్భాల్లో తెలియజేశాడు.
ఇక ఈమెతో పాటుగా మరొక హీరోయిన్ ని కూడా ఈ సినిమాలో భాగం చేయాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. నిజానికి త్రివిక్రమ్ సినిమాలో అవసరం ఉన్నా లేకపోయినా ఇద్దరు హీరోలు ఉంటారు అనేది మొదటి నుంచి పాతుకుపోయిన విషయం… తను ఏ సినిమా చేసిన కూడా తన సినిమాలో ఇద్దరు హీరోలకు స్కోప్ ఉండే విధంగా క్యారెక్టర్స్ రాసుకుంటాడు… ఇక అందులో భాగంగానే ఈ సినిమాలో సైతం ఇద్దరు హీరోలని సెట్ చేసినట్టుగా తెలుస్తోంది.
అందులో ఒకరు శ్రీనిధి శెట్టిగాl కాగా, మరొక హీరోయిన్ ఎవరు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇక కొత్త హీరోయిన్ ని బాలీవుడ్ నుంచి తీసుకొచ్చే ప్రయత్నంలో త్రివిక్రమ్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆ సెకండ్ హీరోయిన్ ఎవరు అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…