Sachin Tendulkar: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉమ్మడి అనంతపురం జిల్లా పుట్టపర్తి లోని సత్య సాయి బాబా జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.. శతజయంతి వేడుకలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ఘనంగా నిర్వహిస్తోంది.. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఇతర అతిరథ మహారధులు హాజరయ్యారు.. ఇప్పటికే నరేంద్ర మోడీ సత్యసాయిబాబా ఆశ్రమం మొత్తాన్ని కలియ తిరిగారు. ఆశ్రమంలో ఏర్పాటు చేసిన ఆస్పత్రులు.. ఇతర సేవా కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి కంటే ముందు నరేంద్ర మోడీ సత్య సాయి బాబా తో తనకున్న అనుబంధాన్ని బయటపెట్టారు. దానికి సంబంధించిన ఫోటోలను ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
సత్య సాయి బాబా శతజయంతి వేడుకలకు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ హాజరయ్యారు. సందర్భంగా ఆయన సత్యసాయిబాబా తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. 2011 వన్డే వరల్డ్ కప్ సమయంలో సత్య సాయి బాబా తమను ఏ స్థాయిలో ప్రేరణకు గురిచేసింది సచిన్ వివరించారు. ” 2011 వరల్డ్ కప్ సమయంలో నేను సత్యసాయిబాబా ఆశ్రమానికి వెళ్లాను. అక్కడ ఆయనతో మాట్లాడాను. ఒక రకమైన నిర్వేదం నాలో ఆయనను కనిపించింది. ఆయన భగవత్ స్వరూపులు కాబట్టి వెంటనే గుర్తించారు. నేను నా సమస్య చెప్పడానికి అంటే ముందు ఆయన వెంటనే స్పందించారు.. సమస్యను గుర్తించి దాని పరిష్కారానికి ఏం చేయాలో చెప్పారని” సచిన్ పేర్కొన్నారు.
సచిన్ కు ఆ సందర్భంలో సత్యసాయిబాబా ఒక పుస్తకాన్ని బహుకరించారు. ఆ పుస్తకంలో సానుకూల అంశాలు.. విజేతగా మారాలంటే ఎలాంటి నిబంధనలు పాటించాలి.. ఎలాంటి విధానాలు అవలంబించాలి.. ఎటువంటి ఆసక్తులను పెంపొందించుకోవాలి.. ఎటువంటి అనురక్తులను పాటించాలి.. అనే విషయాలు అందులో ఉన్నాయి. వాటిని సచిన్ పాటించారు. తను మాత్రమే కాదు జట్టులో ఉన్న సభ్యులకు మొత్తం కూడా చెప్పారు. దీంతో 2011 వన్డే వరల్డ్ కప్ లో టీమిండియా కు విజయం సాధ్యమైంది. కపిల్ దేవ్ సారధ్యంలో వన్డే వరల్డ్ కప్ సాధించిన టీమ్ ఇండియా.. దశాబ్దాల అనంతరం మళ్లీ విజేతగా నిలిచింది. 2011 వన్డే వరల్డ్ కప్ విజయం తర్వాత సచిన్ ఆశ్రమానికి వచ్చారు. సాయిబాబా ఆశీస్సులు తీసుకున్నారు.
సచిన్ 2011 వన్డే వరల్డ్ కప్ విజయం నాటి జ్ఞాపకాలను చెబుతున్నప్పుడు దేశ ప్రధాని నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఇతర అతిరథ మహారధులు అత్యంత శ్రద్ధగా విన్నారు. సత్య సాయిబాబాతో తనకున్న అనుబంధాన్ని సచిన్ చెబుతున్నప్పుడు భావోద్వేగానికి గురయ్యారు.