Trisha Enter to politics: దక్షిణ భారత చలన చిత్ర పరిశ్రమలో రెండు దశాబ్దాల నుండి స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న నటి త్రిష కృష్ణన్..సినిమాల్లోకి రాకముందు మోడలింగ్ రంగం లో గొప్పగా రాణించిన త్రిష ఆ తర్వాత జోడి అనే సినిమా తో వెండితెర కి పరిచయం అయ్యింది..ప్రశాంత్ – సిమ్రాన్ హీరో హీరోయిన్లు గా నటించిన ఈ సినిమా లో సిమ్రాన్ స్నేహితురాలిగా నటించింది త్రిష. ఆ తర్వాత సూర్య హీరో గా వచ్చిన ‘మౌనం పెసియాదే’ అనే సినిమా తో తొలిసారిగా హీరోయిన్ అయ్యింది..ఆలా వరుసగా తమిళ సినిమాల్లో హీరోయిన్ గా చేస్తూ వచ్చిన త్రిష తెలుగు లో తరుణ్ హీరో గా నటించిన ‘నీ మనసు నాకు తెలుసు’ అనే సినిమా ద్వారా పరిచయం అయ్యింది.
Also Read: Kanishka Soni: వింత పెళ్లి చేసుకున్న హీరోయిన్.. ఫోటోలు వైరల్.. పైగా శృంగారానికి మగాడు అవసరం లేదట !
ఆ తర్వాత ఆమె హీరోయిన్ గా నటించిన వర్షం సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో మన అందరికి తెలిసిందే..ఈ సినిమా తర్వాత ఆమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు..వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ కొడుతూ తెలుగు తమిళం బాషలలో స్టార్ హీరోస్ తో నటిస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతుంది..ఎంత మంది కొత్త హీరోయిన్స్ ఇండస్ట్రీ కి వస్తున్నా కూడా త్రిష క్రేజ్ ఇప్పటికి ఏ మాత్రం తగ్గలేదు. అలా హీరోయిన్ గా ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించిన త్రిష ప్రస్తుతం తన దృష్టిని రాజకీయాల వైపు మరలించినట్టు కోలీవుడ్ వర్గాల్లో ఒక టాక్ వినిపిస్తుంది..తమిళ స్టార్ హీరో విజయ్ సలహా మేరకు త్రిష ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది..విజయ్ తో ఈమె కలిసి ఎన్నో సెన్సషనల్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో నటించింది..ఈ క్రమం లో ఈమెకి విజయ్ తో ఎంతో సాన్నిహిత్యం ఉంది.
Also Read: Pawan Kalyan : జాతీయస్థాయిలో మార్మోగుతున్న పవన్ కళ్యాణ్ కౌలు రైతు భరోసా యాత్ర, జనవాణి
తన వ్యక్తిగత విషయాలను కూడా తరుచు పంచుకునేంత చనువు కూడా ఉంది..దానితో విజయ్ త్రిష కి సమాజం పట్ల ఉన్న ప్రేమ ని చూసి రాజకీయాల్లోకి వెళ్లాల్సిందిగా సూచించాడట..అతి త్వరలోనే ఆమె కాంగ్రెస్ పార్టీ లో చేరబోతున్నట్టు సమాచారం..దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే బయటకి రానున్నాయట..ప్రస్తుతం త్రిష చేతిలో 4 తమిళ సినిమాలు..ఒక మలయాళం సినిమా ఉంది..వీటిల్లో 3 సినిమాలు షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకి దగ్గరలో ఉన్నాయి..మలయాళం లో మోహన్ లాల్ హీరో గా నటిస్తున్న ‘రామ్’ తమిళం లో ‘ది రోడ్’ అనే సినిమాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి..ఈ రెండు సినిమాలు పూర్తి చేసిన తర్వాత ఆమె రాజకీయాల్లోకి అడుగుపెట్టే అవకాశం ఉంది..మరి సినిమాల్లో లాగానే రాజకీయాల్లో కూడా త్రిష సక్సెస్ ని చూస్తుందో లేదో చూడాలి.