Prabhas Marriage: పాన్ ఇండియా స్టార్ ఇమేజ్, వందల కోట్ల సంపాదన, కీర్తి ప్రతిష్టలు… అన్నింటికీ మించి కోట్లాది అభిమానగణం ప్రభాస్ సొంతం. దేశంలోనే అతిపెద్ద స్టార్ గా ప్రభాస్ అవతరించాడు. అలాంటి ప్రభాస్ ఎందుకు పెళ్లి చేసుకోవడం లేదనేది మిలియన్ డాలర్ ప్రశ్న. గత పదేళ్లుగా ప్రభాస్ పెళ్లి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అదుగో పులి అంటే ఇదిగో తోక అన్నట్లు పలుమార్లు అమ్మాయి కూడా కుదిరింది పెళ్లే తరువాయి అని కథనాలు వెలువడ్డాయి.ఆయన పెదనాన్న కృష్ణంరాజు ఎక్కడికెళ్లినా ప్రభాస్ పెళ్లి గురించే అడుగుతారు. ఆ సమయానికి ఏదో ఒక సమాధానం చెప్పి తప్పుకోవడం మినహాయించి ఆయన కూడా స్పష్టత ఇచ్చేవారు కాదు.

బాహుబలి 2 విడుదల తర్వాత ప్రభాస్ కచ్చితంగా పెళ్లి చేసుకుంటారని భావిస్తే… మరో ఐదేళ్లు దాటిపోయాయి. 40 ప్లస్ లో ఉన్న ప్రభాస్ ఎందుకు వివాహం చేసుకోవడం లేదన్న విషయంపై ఆయన తల్లి శివకుమారి క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తుంది. దీనంతటికీ కారణం రవి అనే వ్యక్తి అని ఆమె సన్నిహితులతో చెప్పారట. ప్రభాస్ కి రవి బెస్ట్ ఫ్రెండ్. అతన్ని ప్రభాస్ ఎంతగానో ప్రేమిస్తాడట. ఎంత బిజీగా ఉన్న ప్రతిరోజు ఫోన్ చేసి మాట్లాడతాడట.
కాగా రవి లవ్ లో ఫెయిల్ అయ్యాడట. ప్రేమించిన అమ్మాయి మోసం చేయడంతో రవి మానసిక వేదన అనుభవించాడట. ఇక అమ్మాయిల మనస్తత్వం, పెళ్లి గురించి రవి చాలా నెగిటివ్ ఒపీనియన్ కలిగి ఉండేవాడట. 45 ఏళ్లు దాటినా రవి పెళ్లి చేసుకోలేదట. ప్రాణస్నేహితుడు రవి చెప్పిన మాటలు ప్రభాస్ ని ఎంతగానో ప్రభావితం చేశాయట. ఆ కారణంగానే ప్రభాస్ పెళ్లి పట్ల ఆసక్తి చూపడం లేదని ఆయన తల్లి చెప్పినట్లు ఓ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. ఏది ఏమైనా ప్రభాస్ కి నచ్చజెప్పి ఈ ఏడాది వివాహం చేస్తామని కూడా ఆమె అన్నారట.

కాగా ప్రభాస్ తో నాలుగు సినిమాలు చేసిన అనుష్క శెట్టిని ఆయన వివాహం చేసుకోనున్నట్లు గట్టి ప్రచారం జరిగింది. అనుష్క కూడా వివాహం చేసుకోకుండా సింగిల్ గా ఉంటుండగా ఈ పుకార్లకు బలం చేకూరింది. బాహుబలి విడుదల అనంతరం పెళ్లి చేసుకుంటారని అందరూ భావించారు. సాహో మూవీ ప్రమోషన్స్ సమయంలో ప్రభాస్ ని ఈ ప్రశ్న వేధించింది. ఆయన ఎక్కడికెళ్లినా అనుష్క గురించి అడిగేవారు. ఆమె నాకు బెస్ట్ ఫ్రెండ్ మాత్రమేనని ప్రభాస్ చెప్పేవారు. ఇక ఒకటి మూడు సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ పెళ్లి చేసుకోవడం కష్టమేనని కొందరు అంటున్నారు.
Also Read:Kanishka Soni: వింత పెళ్లి చేసుకున్న హీరోయిన్.. ఫోటోలు వైరల్.. పైగా శృంగారానికి మగాడు అవసరం లేదట !


[…] Also Read: Prabhas Marriage: ప్రభాస్ ని పెళ్లంటే భయపడేలా చే… […]
[…] Also Read: Prabhas Marriage: ప్రభాస్ ని పెళ్లంటే భయపడేలా చే… […]
[…] Also Read: Prabhas Marriage: ప్రభాస్ ని పెళ్లంటే భయపడేలా చే… […]
[…] Also Read: Prabhas Marriage: ప్రభాస్ ని పెళ్లంటే భయపడేలా చే… […]