నచ్చినవాడినే పెళ్లి చేసుకుంటా: త్రిష

చెన్నై బ్యూటీ త్రిష పెళ్లిపై గత కొంతకాలంగా త్రిష పెళ్లిపై అనేక రూమర్లు చక్కర్లు కొట్టాయి. అయితే తాజాగా త్రిష తన మనస్సులోని మాటను వెల్లడించింది. తాను తల్లిదండ్రులు చూపించే వ్యక్తిని చేసుకోననని.. తనకు నచ్చినవాడినే చేసుకుంటానని స్టేట్మెంట్ ఇచ్చింది. అందంగా లేకపోయినా.. సినిమా హీరో కాకపోయినా మంచివాడైతే చాలని.. అలాంటి వ్యక్తిని వెంటనే భర్తగా స్వీకరిస్తానని త్రిష పేర్కొంది సీనియర్ హీరో అయిన త్రిషకు ప్రస్తుతం సినిమా అవకాశాలు తగ్గాయి. గతకొంతకాలంగా అరకొర సినిమాలతోనే కాలంవెళ్లదీస్తున్నారు. […]

Written By: Neelambaram, Updated On : March 13, 2020 4:13 pm
Follow us on

చెన్నై బ్యూటీ త్రిష పెళ్లిపై గత కొంతకాలంగా త్రిష పెళ్లిపై అనేక రూమర్లు చక్కర్లు కొట్టాయి. అయితే తాజాగా త్రిష తన మనస్సులోని మాటను వెల్లడించింది. తాను తల్లిదండ్రులు చూపించే వ్యక్తిని చేసుకోననని.. తనకు నచ్చినవాడినే చేసుకుంటానని స్టేట్మెంట్ ఇచ్చింది. అందంగా లేకపోయినా.. సినిమా హీరో కాకపోయినా మంచివాడైతే చాలని.. అలాంటి వ్యక్తిని వెంటనే భర్తగా స్వీకరిస్తానని త్రిష పేర్కొంది

సీనియర్ హీరో అయిన త్రిషకు ప్రస్తుతం సినిమా అవకాశాలు తగ్గాయి. గతకొంతకాలంగా అరకొర సినిమాలతోనే కాలంవెళ్లదీస్తున్నారు. అయినప్పటికీ త్రిషలో యువతలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తెలుగులో అగ్రహీరోలందరిలో త్రిష ఆడిపాడింది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ మూవీలో నటిస్తుంది. అలాగే కొన్ని తమిళ సినిమాల్లో నటిస్తుంది. ఇటీవల తమిళంలో త్రిష నటించిన ‘96’ భారీ విజయం సాధించింది.

ప్రస్తుతం త్రిష వయస్సు 36 సంవత్సరాలు. గతంలో ఓ హీరోతో త్రిష్ డేటింగ్‌లో ఉన్నట్లు ప్రచారం జరిగింది. దీనిపై త్రిష అప్పట్లో ఖండించింది. పెళ్లికాని ముదురు భామల్లో త్రిష, అనుష్క ముందు వరుసలో ఉన్నారు. ఇన్నిరోజుల నుంచి ఆమె కంటికి కనిపించని ఆ మంచివాడు ఇంకెప్పుడు కనిపిస్తాడని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. త్రిష కోరుకున్నట్లు ఆ మంచివాడు.. నచ్చినవాడు త్వరగా కన్పించాలని కోరుకుందాం..