https://oktelugu.com/

రానాను త్రిష అంత మాట అనేసిందా?

టాలీవుడ్‌లో ప్లేబాయ్‌ ఇమేజ్ ఉన్న నటుడు రానా దగ్గుబాటి. తన జిగ్రీ దోస్తు అల్లు అర్జున్‌ ఇప్పటికే ఇద్దరు పిల్లల తండ్రి అయినా.. రామ్‌ చరణ్ ఎప్పుడో పెళ్లి చేసుకున్నా రానా 35 ఏళ్లు వచ్చే దాకా బ్యాచ్‌లర్గా ఉన్నాడు. ఈ మధ్యే మిహికా బజాజ్‌ అనే అమ్మాయిని లవ్ మ్యారేజ్ చేసుకోబోతున్నట్టు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. తానే ఆమెకు ప్రపోజ్‌ చేయగా ఓకే చెప్పిందని రానా స్వయంగా వెల్లడించాడు. ఇన్నాళ్లకు రానా ఒక ఇంటివాడు అవుతున్నందుకు […]

Written By:
  • Neelambaram
  • , Updated On : May 27, 2020 / 05:56 PM IST
    Follow us on


    టాలీవుడ్‌లో ప్లేబాయ్‌ ఇమేజ్ ఉన్న నటుడు రానా దగ్గుబాటి. తన జిగ్రీ దోస్తు అల్లు అర్జున్‌ ఇప్పటికే ఇద్దరు పిల్లల తండ్రి అయినా.. రామ్‌ చరణ్ ఎప్పుడో పెళ్లి చేసుకున్నా రానా 35 ఏళ్లు వచ్చే దాకా బ్యాచ్‌లర్గా ఉన్నాడు. ఈ మధ్యే మిహికా బజాజ్‌ అనే అమ్మాయిని లవ్ మ్యారేజ్ చేసుకోబోతున్నట్టు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. తానే ఆమెకు ప్రపోజ్‌ చేయగా ఓకే చెప్పిందని రానా స్వయంగా వెల్లడించాడు. ఇన్నాళ్లకు రానా ఒక ఇంటివాడు అవుతున్నందుకు అందరూ సంతోషిస్తున్నారు. అదే సమయంలో ఇది వరకు రానా లవ్‌ ఎఫైర్స్‌ గురించి తెగ మాట్లాడుకుంటున్నారు. మన బల్లాలదేవుడి గాళ్‌ఫ్రెండ్స్‌ లిస్టు పెద్దదే అయినా మొదట గుర్తుచ్చేది త్రిష గురించే. గతంలో త్రిషతో డేటింగ్‌ చేసినట్టు రానానే చెప్పాడు. త్రిషతో రిలేషన్‌ నిజమే అని, తమ మధ్య కొంతకాలం డేటింగ్‌ నడిచిన మాట వాస్తవమే అని ఓ టాక్‌షోలో వెల్లడించాడు. ఆ తర్వాత ఆ అఫైర్కు పుల్‌స్టాప్‌ పెట్టి స్నేహితులుగానే ఉండాలని అనుకున్నామని రానా చెప్పాడు.

    మిహికాతో మ్యారేజ్‌ను అనౌన్స్‌ చేసిన తర్వాత లక్ష్మీ మంచుతో ఇన్‌స్టాగ్రామ్‌లో మాట్లాడిన రానా.. తన గాళ్‌ఫ్రెండ్స్‌ గురించి ప్రస్తావించాడు. మిహికాతో పెళ్లి అనగానే వాళ్లంతా హ్యాపీగా ఫీలయ్యారని చెప్పాడు. త్రిష కూడా రానాకు ఫోన్‌ చేసి కంగ్రాట్స్‌ చెప్పిందన్న వార్తలు వచ్చాయి. అయితే, కొంతకాలం తెలుగులో అగ్ర హీరోయిన్‌గా వెలుగొందిన త్రిష తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఓ పోస్ట్‌ చర్చనీయాంశమైంది. తమ మాజీ ప్రియురాళ్లను స్నేహితులుగా కొనసాగించాలని అనుకునేవాళ్లు అహంకారులుగా మిగిలిపోతారని ఒక స్టడీలో తేలిందని త్రిష పోస్ట్ చేసింది. ఈ విషయం తనకు ముందే తెలుసు అని కామెంట్‌ చేయడం చర్చనీయాంశమైంది.

    రానాను ఉద్దేశించే త్రిష ఈ పోస్ట్‌ పెట్టిందని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. బల్లాలదేవుడిని త్రిష అంత మాట అనేసిందా? అని పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దాంతో, త్రిష ఈ పోస్టును డిలీట్ చేసింది. అయినా రచ్చ ఆగడం లేదు. అప్పటికే ఈ కామెంట్‌ను స్ర్కీన్‌ షాట్‌ తీసిన నెటిజన్లు సోషల్‌ మీడియాలో షేర్ చేస్తున్నారు.