కారు ప్రమాదంలో సినీ నటి మృతి

వర్ధమాన సినీనటి కారు ప్రమదంలో మృతిచెందడంతో చిత్ర పరిశ్రమలో విషాదచాయలు నెలకొన్నాయి. కన్నడ సినీ, టెలివిజన్ నటి మెబియానా మైఖేల్(22) బుధవారం కారుప్రమాదంలో మృతిచెందింది. ఆమె మృతిపై కన్నడ చిత్ర, టెలివిజన్ నటీనటులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. కాగా కిందటి నెలలోనూ తమిళ సినీ పరిశ్రమకు చెందిన ఓ యువదర్శకుడు రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. దర్శకుడు శంకర్ దగ్గర అసిస్టెంట్ పని […]

Written By: Neelambaram, Updated On : May 27, 2020 6:00 pm
Follow us on

వర్ధమాన సినీనటి కారు ప్రమదంలో మృతిచెందడంతో చిత్ర పరిశ్రమలో విషాదచాయలు నెలకొన్నాయి. కన్నడ సినీ, టెలివిజన్ నటి మెబియానా మైఖేల్(22) బుధవారం కారుప్రమాదంలో మృతిచెందింది. ఆమె మృతిపై కన్నడ చిత్ర, టెలివిజన్ నటీనటులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. కాగా కిందటి నెలలోనూ తమిళ సినీ పరిశ్రమకు చెందిన ఓ యువదర్శకుడు రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. దర్శకుడు శంకర్ దగ్గర అసిస్టెంట్ పని చేసిన అరుణ్ కూడా అకస్మాత్తుగా రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు.

మెబియానా మైఖేల్ తన స్నేహితులతో కలిసి బెంగళూరు నుంచి తన స్వస్థలమైన మాడికేరికి కారులో బయలుదేరింది. ఈక్రమంలోనే దేవిహల్లి వద్ద మలుపులోవారు ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదవశాత్తు ఎదురుగా వస్తున్న ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. ఈ సంఘటనలో కారులోని వారందరికీ తీవ్రగాయాలయ్యాయి. వీరిని స్థానికులు సమీపంలోని ఆసుప్రతికి తరలించారు. అయితే తీవ్రగాయాలపాలైన మెబిలియా మైఖేల్ ఆసుప్రతిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతిచెందింది. ఆమె స్నేహితుల పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె కన్నడ రియాలిటీ షో ‘ప్యతే హుదుగిర్ హల్లి లైఫ్’ సీజన్ 4 ద్వారా టెలివిజన్‌లోకి రంగంలోకి ప్రవేశించించింది. అంతకముందు కొన్నేళ్లపాటు మెబియానా మైఖేల్ మోడలింగ్‌లో ఉన్నారు. కొన్ని సీరియల్స్, సినిమాల్లో నటించడానికి చర్చలు జరుపుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు దుర్మరణం చెందారు. 22ఏళ్ల వయస్సులోనే ఆమె మృత్యువాతపడటంతో స్నేహితులు, బంధువులు, తోటి నటీనటులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆమె మృతిపై పలువురు సెలబ్రెటీలు సంతాపం వ్యక్తం చేశారు.