Tripti Dimri: రీసెంట్ గా రిలీజ్ అయి సంచలనాన్ని సృష్టిస్తున్న అనిమల్ సినిమా గురించి ప్రతి ఒక్కరూ రకరకాలుగా చెప్పుకుంటున్నారు. ఒకరైతే దసందీప్ వంగ లాంటి డైరెక్టర్ ఇండియాలోనే లేడు ఆయనే బెస్ట్ డైరెక్టర్ అంటూ పొగుడుతుంటే మరి కొంతమంది మాత్రం కొన్ని నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా అయితే భారీ రేంజ్ లో సక్సెస్ సాధించడం అనేది నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. ఇక రన్బీర్ కపూర్ కెరియర్ లో అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా ఈ సినిమా నిలుస్తుంది అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందాన నటించినప్పటికీ ఒక 15 నిమిషాల పాటు కనిపించే ఒక క్యారెక్టర్ లో త్రిప్తి డిమ్రిల్ నటించింది. అయితే ఆమెకు సంబంధించిన కొన్ని బోల్డ్ సీన్లు ఈ సినిమాలో ఉండటం వల్ల డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ షూటింగ్ కి ముందు ఎలాగైతే ఆమెకి సినిమాలో ఎలాంటి సీన్స్ అయితే ఉంటాయని చెప్పి ఒప్పించాడో అలాంటి సీన్లనే ఈ సినిమాలో తెరకెక్కించాడు. ఈ విషయంలో ఆమె కూడా చాలా క్లారిటీ ఉంది.ఇక ఇప్పుడు మాత్రం త్రిప్తి వల్ల పేరెంట్స్ రణ్బీర్ కపూర్ తో ఆ బెడ్ సీన్ లాంటివి చేయడం పట్ల కొంత అసహనాన్ని వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది.
దానిమీద తృప్తి వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడి ఇంతకు ముందే ఇలాంటి సీన్లు ఉంటాయని ముందే డైరెక్టర్ నాకు చెప్పాడు అయినప్పటికీ నేను సినిమాని ఒప్పుకున్నాను మీరు అనుకున్నంత అక్కడ ఏమి జరగలేదు నా హద్దుల్లో నేనున్నాను, ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉన్నారు అంటూ వాళ్ళ పేరెంట్స్ కి చెప్పినట్టుగా తెలుస్తుంది. దాంతో వాళ్ల పేరెంట్స్ కూడా కన్విన్స్ అయినట్టుగా తెలుస్తుంది. నిజానికి పెద్ద సినిమాల్లో ఇలాంటి క్యారెక్టర్ రావడం అనేది చాలా గొప్ప విషయం అనే చెప్పాలి. త్రిప్తి కూడా ఈ క్యారెక్టర్ ని బాగా వాడుకుంది.
దాంతో ప్రస్తుతానికి ఆమె ఇండియా లెవెల్లో సూపర్ గా ఫేమస్ అయింది…ఇక ప్రస్తుతం ఆమెకి అన్ని భాషల్లో నుంచి మంచి ఆఫర్లు వస్తున్నట్లుగా తెలుస్తుంది. తెలుగులో అనిల్ రావిపూడి, రవితేజ కాంబినేషన్ లో వచ్చే సినిమాలో కూడా తను హీరోయిన్ గా సెట్ అయినట్టుగా వార్తలు వస్తున్నాయి…ఇక ఈ ఒక్క సినిమా తో ఆమె లైఫ్ మొత్తం చేంజ్ అయిందనే చెప్పాలి…