Priyanka Singh: బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక సింగ్ అలియాస్ పింకీ పెళ్లికి సిద్ధమైంది.తన హల్దీ వేడుకకు సంబంధించిన ఫోటోలు వైరల్ కాగా, వరుడు ఎవరంటూ అభిమానులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. జబర్దస్త్ కామెడీ షోలో లేడీ గెటప్స్ వేస్తూ ఫేమస్ అయ్యారు ప్రియాంక సింగ్. అనంతరం ఆమె బిగ్ బాస్ సీజన్ 5లో ఛాన్స్ దక్కించుకున్నారు. అమ్మాయిలకు మించిన అందంతో, ఆకట్టుకునే డ్రెస్ లతో ప్రేక్షకుల్లో మంచి పాపులారిటీ తెచ్చుకున్నారు. అబ్బాయిగా పుట్టిన తాను ఇష్టంతో అమ్మాయిగా మారినట్లు కూడా వెల్లడించింది. ఆ విషయం వాళ్ళ నాన్నకు తెలియదని, షో వేదికగా బహిర్గతం చేసి, ఆయనకు క్షమాపణలు చెప్పింద

ఇక నటుడు మానస్ తో ఈమె సాగించిన ప్రేమాయణం షోలో మరొక హైలెట్ పాయింట్ అని చెప్పాలి. వెళ్లిన వారం రోజులకే ప్రియాంక మానస్ కి పడిపోయింది. అతడంటే ఇష్టం అంటూ యాంకర్ రవితో ఓపెన్ గా చెప్పేసింది. హౌస్ లో ఎవరినైనా అన్నయ్య అంటాను ఒక్క మానస్ ని తప్ప అని ఆమె చెప్పడం విశేషం. మానస్ అంటే అమితంగా ఇష్టపడే ప్రియాంక సింగ్ అతడితోనే ఎక్కువ సమయం గడిపేది. భార్యకు మించి సేవలు చేసేది. అతన్ని ఎవరైనా విమర్శిస్తే సహించేది కాదు. గేమ్స్, టాస్క్స్ లో వీలైంతే మానస్ కోసం త్యాగం చేసేది.
Also Read: JP Nadda Nitin: మొన్న ఎన్టీఆర్.. నేడు నితిన్.. తెలుగు హీరోలతో బిజెపి నేతల వరుస భేటీల కథేంటి?

అంతగా మానస్ ని ప్రేమించిన ప్రియాంక షో నుండి బయటకు వచ్చాక పెద్దగా కలవలేదు. మొదట్లో కొన్నాళ్ళు కలిసున్న ఈ జంట మెల్లగా ఎవరి కెరీర్ లో వాళ్ళు బిజీ అయ్యారు. తాజాగా ప్రియాంక మెహందీ వేడుక ఫోటోలు సోషల్ మీడియా ద్వారా బయటికి రావడం హాట్ టాపిక్ అయ్యింది. అందులోనూ కొన్ని సోషల్ మీడియా పోస్ట్స్ తో ఆమె పరోక్షంగా కూడా హింట్ ఇచ్చారు. ఈ క్రమంలో ప్రియాంక వివాహం చేసుకోనున్న ఆ వ్యక్తి ఎవరనే ఆత్రుత అందరిలో మొదలైంది. ప్రస్తుతానికి అది మాత్రం సస్పెన్సు. మరి కాబోయేవాడిని పింకీ ఎప్పుడు పరిచయం చేస్తుందో చూడాలి.

Also Read:NDTV Prannoy Roy: ఎన్టీటీవీ ప్రణయ్ రాయ్ ఎందుకు అప్పుల పాలయ్యారు? ఎందుకు అమ్ముకుంటున్నారు?
[…] Also Read: Priyanka Singh: ట్రాన్స్ జెండర్ ప్రియాంక సింగ్… […]
[…] Also Read: Priyanka Singh: ట్రాన్స్ జెండర్ ప్రియాంక సింగ్… […]