Liger Effect: కోట్ల సినిమా రెండో రోజే పడిపోతే బయ్యర్స్, థియేటర్ ఓనర్స్, నిర్మాతల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో చెప్పడం కష్టమే. భారీ హైప్ క్రియేట్ చేసిన లైగర్ పై నిర్మాతల నుండి థియేటర్ ఓనర్స్ వరకు అందరూ చాలా ఆశలు పెట్టుకున్నారు. వాళ్ళ ఆశలు, అంచనాలు తలకిందులు చేస్తూ మూవీ ప్లాప్ టాక్ తెచ్చుకుంది. లైగర్ మూవీ కనీసం 50 శాతం రికవరీ సాధించడం కష్టమే. దీంతో భారీగా నష్టపోయిన బయ్యర్లు ఒక్కొక్కరిగా బయటికొచ్చే అవకాశం కలదు.
కాగా ముంబైకి చెందిన ఓ థియేటర్ ఓనర్ విజయ్ దేవరకొండపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యాడు. నీ కారణంగా మొత్తం కోల్పోయానని విమర్శలు గుప్పించాడు. మనోజ్ దేశాయ్ అనే థియేటర్ యజమాని తాజా ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ తలపొగరు వ్యాఖ్యల కారణంగా కూడా సినిమా నష్టపోయింది అంటున్నారు. కావాలంటే నా సినిమాను బాయ్ కాట్ చేయండని స్వయంగా చెప్పి భారీ నష్టానికి కారణమయ్యాడు. ఈ కామెంట్స్ అడ్వాన్స్ బుకింగ్స్ ని విపరీతంగా దెబ్బతీశాయని ఆయన ఆవేదన చెందారు.
Also Read: Priyanka Singh: ట్రాన్స్ జెండర్ ప్రియాంక సింగ్ పెళ్లి… వరుడు ఎవరంటే? హల్దీ ఫోటోలు వైరల్
లైగర్ మూవీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. జరగాల్సిన నష్టం జరిగిపోయింది. విజయ్ నువ్వు కొండవి కాదు అనకొండవి. విపరీత కాలే వినాశ బుద్ధి. పోయేకాలం దగ్గర పడినప్పుడు ఇలాంటి మాటలే వస్తాయి. నీలాగే మాట్లాడిన అమిర్ ఖాన్, తాప్సి, అక్షయ్ కుమార్ సినిమాల పరిస్థితి చూడలేదా?. నువ్వు అహంకారివి… అంటూ ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. విజయ్ దేవరకొండను ఉద్దేశిస్తూ మనోజ్ దేశాయ్ చేసిన ఈ కామెంట్స్ నేషనల్ మీడియాలో పతాక స్థాయికి ఎక్కాయి.
లైగర్ ప్రమోషన్స్ లో విజయ్ యాటిట్యూడ్ చూపించడంతో పాటు ఒకటి రెండు కారణాలతో విడుదలకు ముందు ‘బాయ్ కాట్ లైగర్’ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేశారు. ఆ మూవీ చూడవద్దని నెటిజెన్స్ పిలుపునిచ్చారు. అప్పుడు విజయ్ దేవరకొండ కావాలంటే నా మూవీ బాయ్ కాట్ చేసుకోండి… అని కామెంట్ చేశాడనేది మనోజ్ దేశాయ్ ఆరోపణ. ఆయన వ్యాఖ్యలు ఓపెనింగ్స్ ని దెబ్బతీశాయి అంటున్నారు. లాల్ సింగ్ చెడ్డా మూవీ బాయ్ కాట్ ట్రెండ్ తో ఎంత నష్టపోయిందో తెలిసి కూడా విజయ్ గర్వం ప్రదర్శించడాన్ని ఆయన తప్పుబడుతున్నాడు.
Also Read:JP Nadda Nitin: మొన్న ఎన్టీఆర్.. నేడు నితిన్.. తెలుగు హీరోలతో బిజెపి నేతల వరుస భేటీల కథేంటి?