https://oktelugu.com/

RRR Movie: ఆర్​ఆర్​ఆర్​ ట్రైలర్​పై పెరుగుతున్న అంచనాలు.. ​ఆకట్టుకుంటున్న న్యూ పోస్ట్​

RRR Movie: దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం “ఆర్ఆర్ఆర్”. టాలీవుడ్ స్టార్ హీరోల అయినా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ – యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా పాన్ ఇండియన్ నేపథ్యంలో భారీ బడ్జెట్ తో అగ్ర నిర్మాత డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించారు. బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగణ్, ఆలియా భట్ అలానే హాలీవుడ్ యాక్టర్ ఓలివియా మోరీస్, శ్రీయ శరణ్, సముద్రఖని కీలక పాత్రల్లో నటించారు. […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 7, 2021 / 03:43 PM IST
    Follow us on

    RRR Movie: దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం “ఆర్ఆర్ఆర్”. టాలీవుడ్ స్టార్ హీరోల అయినా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ – యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా పాన్ ఇండియన్ నేపథ్యంలో భారీ బడ్జెట్ తో అగ్ర నిర్మాత డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించారు. బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగణ్, ఆలియా భట్ అలానే హాలీవుడ్ యాక్టర్ ఓలివియా మోరీస్, శ్రీయ శరణ్, సముద్రఖని కీలక పాత్రల్లో నటించారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలకు సిద్ధంగా ఉంది ఈ చిత్రం.

    ఇప్పటికే ఈ చిత్రం ప్రమోషన్స్ శరవేగంగా జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్స్,టీజర్, పాటలు ప్రేక్షక అభిమానులలో ఈ మూవీ పై ఇంకాస్త భారీ అంచనాలు పెంచాయి. మరోవైపు డిసెంబరు 9న సినిమా ట్రైలర్​ విడుదల చేయనున్న సంగతి తెలిసిందే.

    కాగా తాజాగా ఈ సినమాపై మరింత హైప్​ క్రియేట్​ చేసేందుకు రైజ్ యువర్ సెల్ఫ్​ ఫర్​ రామ్​ పేరుతో ఓ వీడియో విడుదల చేశారు ఎన్టీఆర్​. ఇందులో భాగంగా ట్రైలర్‌లో రామ్‌చరణ్‌ పాత్రకు సంబంధించిన ఒక సన్ని వేశాన్ని కట్‌ చేసి ఈ వీడియోను రూపొందించారు. పోలీస్‌ డ్రెస్‌ ధరించిన చెర్రీ మంటల్లోంచి నడుచుకురావడం ఈ క్లిప్‌లో మనం చూడవచ్చు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్​గా మారింది. దీంతో ట్రైలర్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు అభిమానులు.