https://oktelugu.com/

ట్రైలర్ టాక్: ఉత్కంఠ రేపేలా ‘థాంక్యూ బ్రదర్’

సినిమా.. ఆరు పాటలు, నాలుగు ఫైట్లు అనేది ఒకప్పటి ట్రెండ్ కానీ.. ఇప్పుడు కాన్సెప్ట్-ఓరియెంటెడ్ కథలు ఇటీవల తెలుగులో క్రమం తప్పకుండా వస్తున్నాయి. వాటిని ప్రేక్షకులు ఆదరిస్తున్నారు కూడా. ఇక ఓటీటీలు వచ్చాక కొత్త కథలు పరిచయం అయ్యి ప్రేక్షకుల అభిరుచి కూడా మారిపోయింది. “థాంక్స్ యు బ్రదర్” మంచి ఉత్కంఠ రేపు కథాంశం ఉన్న సినిమానే. ఈ చిత్రం మే 7న ఆహా ఒటిటి ప్లాట్‌ఫామ్‌లో నేరుగా విడుదలవుతోంది. తాజాగా “థాంక్స్ బ్రదర్” ఫుల్ లెంత్ […]

Written By:
  • NARESH
  • , Updated On : April 30, 2021 / 07:35 PM IST
    Follow us on

    సినిమా.. ఆరు పాటలు, నాలుగు ఫైట్లు అనేది ఒకప్పటి ట్రెండ్ కానీ.. ఇప్పుడు కాన్సెప్ట్-ఓరియెంటెడ్ కథలు ఇటీవల తెలుగులో క్రమం తప్పకుండా వస్తున్నాయి. వాటిని ప్రేక్షకులు ఆదరిస్తున్నారు కూడా. ఇక ఓటీటీలు వచ్చాక కొత్త కథలు పరిచయం అయ్యి ప్రేక్షకుల అభిరుచి కూడా మారిపోయింది.

    “థాంక్స్ యు బ్రదర్” మంచి ఉత్కంఠ రేపు కథాంశం ఉన్న సినిమానే. ఈ చిత్రం మే 7న ఆహా ఒటిటి ప్లాట్‌ఫామ్‌లో నేరుగా విడుదలవుతోంది. తాజాగా “థాంక్స్ బ్రదర్” ఫుల్ లెంత్ ట్రైలర్ ను విడుదల చేశారు.

    ట్రైలర్ చూస్తే ఈ చిత్రం ఇద్దరు అపరిచితులు కలిసి సాగించిన ప్రయాణం అని తెలుస్తోంది. విరాజ్ అశ్విన్ అనే యువకుడు.. నిండు గర్భిణి అయిన జబర్ధస్త్ యాంకర్ అనసూయల మధ్య తలెత్తిన ఒక సమస్య.. అందులోంచి ఎలా బయటపడ్డారన్నది ప్రధాన కథగా ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. నిండుగర్భిణి అయిన అనసూయ భరద్వాజ్ చాలా గంటలు ఒక లిఫ్ట్ లో యువకుడైన విరాజ్ తో కలిసి చిక్కుకుపోతోంది. అదే ట్విస్టులతో ఎండ్ వరకు సాగుతుంది. ఈ కథనం ఉత్కంఠ రేపేలా ఉంది.

    ఈ ట్రైలర్ విరాజ్ అశ్విన్ – అనసూయ పాత్రల చుట్టూనే తిరుగుతుంది. ప్రధాన సంఘర్షణ అంతా వీరిద్దరి మధ్య సాగినట్టు కనిపిస్తోంది. ఈ థ్రిల్లర్ నుండి ఏమి ఆశించాలో అవన్ని ఉన్న మంచి పుష్కలమైన కథగా అర్థమవుతోంది. సినిమాలన్నీ ప్రధాన అంశాన్ని ట్రైలర్ వెల్లడిస్తోంది. ఈ ట్రైలర్ చూస్తే చిత్రంపై ఆసక్తిని పెంచుతోంది. థ్రిల్లర్ లా సాగుతుందని కథనాన్ని బట్టి తెలుస్తోంది.

    రమేష్ రాపర్తి దర్శకత్వం వహించిన ఈ “థాంక్స్ యు బ్రదర్” మూవీని మాగుంట శరత్ చంద్రరెడ్డి.. తారక్నాథ్ బొమ్మి రెడ్డి నిర్మించారు. మే 7న ఆహా ఓటీటీలో ఈ ట్రైలర్ రిలీజ్ అవుతోంది.