Editor Goutham Raju Passed Away: టాలీవుడ్‌లో మరో విషాదం.. ప్రముఖ సినీ దిగ్గజం కన్నుమూత

Editor Goutham Raju Passed Away: తెలుగు చిత్రసీమలో మరో కన్నీటి విషాదం చోటుచేసుకుంది. దిగ్గజ సినిమా ఎడిటర్ గౌతమ్‌రాజు గారు తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 68 సంవత్సరాలు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో ఆయన బాధపడుతున్నారు. ఓ ప్రవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మంగళవారం అర్ధరాత్రి ఆయన హైదరాబాద్‌ లో తన తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్తతో సినీ పరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి. గౌతమ్ రాజు మృతిపై పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతికి […]

Written By: Shiva, Updated On : July 6, 2022 9:25 am
Follow us on

Editor Goutham Raju Passed Away: తెలుగు చిత్రసీమలో మరో కన్నీటి విషాదం చోటుచేసుకుంది. దిగ్గజ సినిమా ఎడిటర్ గౌతమ్‌రాజు గారు తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 68 సంవత్సరాలు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో ఆయన బాధపడుతున్నారు. ఓ ప్రవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మంగళవారం అర్ధరాత్రి ఆయన హైదరాబాద్‌ లో తన తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్తతో సినీ పరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Editor Goutham Raju

గౌతమ్ రాజు మృతిపై పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సంతాపం వ్యక్తం చేశారు. ఎడిటర్ గౌతమ్‌రాజు గారు తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో సుమారు 800 చిత్రాలకు ఎడిటర్ గా పని చేశారు. సౌత్ సినీ పరిశ్రమలోనే ఆయన చెరగని ముద్రవేశారు. ముఖ్యంగా తెలుగులో తెరకెక్కిన ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు ఆయన ఎడిటింగ్ బాధ్యతలను అద్భుతంగా నిర్వర్తించారు.

Also Read: Upasana Konidela: ఉపాసన నుంచి గుడ్ న్యూస్.. మెగాస్టార్ మనవడు కమింగ్ సూన్.. ఇక పండగే

ఆయన మొదటి సినిమా ‘చట్టానికి కళ్లులేవు’. ఈ సినిమాతోనే గౌతమ్ రాజు అనే గొప్ప ఎడిటర్‌ ఉన్నాడని సినీ ప్రపంచానికి తెలిసింది. గౌతమ్‌ రాజు గారు ‘సీనియర్ ఎన్టీఆర్’ కి వీరాభిమాని. ఎన్టీఆర్ పై అభిమానంతోనే ఆయన సినిమాల్లో వచ్చారు. అందుకే.. ఎన్టీఆర్ ఫ్యామిలీకి చెందిన ఏ సినిమా చేసినా.. ఆయన ప్రాణం పెట్టి పని చేసేవారు.

Editor Goutham Raju

ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ ‘ఆది’ చిత్రానికి ఉత్తమ ఎడిటర్‌ గా నంది అవార్డు కూడా అందుకున్నారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి, పవన్‌ కల్యాణ్ నటించిన ఎన్నో సినిమాలకు కూడా గౌతమ్‌రాజు గారు ఎడిటర్ గా పని చేశారు. మంచి మనసు ఉన్న గౌతమ్‌రాజు గారు తుదిశ్వాస విడవడం ఆయన సన్నిహితులను తీవ్రంగా కలిచివేసింది.

ఆయన మృతి పట్లు పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మా ‘ఓకేతెలుగు’ ఛానెల్ తరఫున గౌతమ్‌రాజు గారి మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, శోహార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము.

Also Read:R. Narayana Murthy: ఆర్.నారాయణ మూర్తి ఇంట్లో తీవ్ర విషాదం.. అసలేమైందంటే?

Tags