Toxic Movie Full Story: ‘KGF చాప్టర్ 2’ తర్వాత సుదీర్ఘ విరామం తీసుకున్న కన్నడ స్టార్ హీరో (Rocking Star Yash) యాష్, ఇప్పుడు ‘టాక్సిక్'(Toxic Movie) చిత్రం తో మన ముందుకు రాబోతున్నాడు. షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా మార్చి 19 న విడుదల కాబోతుంది. అదే రోజున ‘ధురంధర్ 2’ చిత్రం కూడా విడుదల అవుతుండడంతో, అంత క్రేజ్ ఉన్న సినిమాకు పోటీగా వచ్చేంత సత్తా ‘టాక్సిక్’ కి ఉందా?, ఒకవేళ వస్తే నష్టాలు తప్పవు, తీవ్రమైన పరిణామాలు ఎదురుకోవాల్సి వస్తుందని చాలా మంది విశ్లేషకులు భయపెట్టారు. కానీ మేకర్స్ మాత్రం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు, మార్చి 19న మా చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేయబోతున్నాము అంటూ మరోసారి ఖరారు చేశారు. దీంతో ఇప్పుడు పోటీ అనివార్యం అయిపోయింది. అయితే ఈ సినిమాకు సంబంధించిన స్టోరీ లైన్ ఇప్పుడు సోషల్ మీడియాలో లీకై బాగా వైరల్ అయ్యింది.
ఇదే స్టోరీ లైన్ ని పెఫెక్ట్ గా తెరకెక్కిస్తే KGF సిరీస్ ని మించిన హిట్ అవుతుందని బలమైన నమ్మకం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. స్టోరీ విషయానికి వస్తే 1950 నుండి 1970 మధ్యలో గోవాలో డ్రగ్స్ కారల్ కింగ్ యాష్ ఎలా తన సామ్రాజ్యాన్ని ఇక ఛత్రాధిపత్యం తో ఏలాడు?, ఈ క్రమం లో అతను ఎదురుకున్న సమస్యలు ఏంటి?, ఎందుకు ఈ నేర ప్రపంచానికి రాజు గా మారాడు?, అందుకు కారణమైన పరిస్థితులు, జీవితం లో తనకు జరిగిన మోసాలు, ఇలా ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ లాగా తీర్చి దిద్దింది డైరెక్టర్ గీతూ మోహన్ దాస్. ఈ సినిమాలో వళ్ళు గగురుపొడిచే యాక్షన్ సన్నివేశాలతో పాటు, మంచి ఎమోషనల్ డ్రామా కూడా ఉండే స్కోప్ ఉంది. డైరెక్టర్ ఈ రెండిటిని పర్ఫెక్ట్ గా బ్యాలన్స్ చేసి ఉంటే మాత్రం, కచ్చితంగా ఈ సినిమా ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తుంది అనే చెప్పొచ్చు.
ఈ చిత్రం లో హీరోయిన్స్ గా నయనతార, రుక్మిణీ వాసంత్, కియారా అద్వానీ వంటి టాప్ స్టార్స్ నటించారు. వీళ్లకు సంబంధించిన ఫస్ట్ లుక్స్ కూడా విడుదల అయ్యాయి. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గానే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ని విడుదల చేయగా, దానికి ఎలాంటి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చిందో మన కళ్లారా చూశాము. ఒక అమ్మాయి అయ్యుండి, ఇలాంటి వయొలెంట్ సినిమా ఎలా తీసింది?, రామ్ గోపాల్ వర్మ, సందీప్ రెడ్డి వంగ లాంటోళ్ళు కూడా ఇంత వయొలెంట్ ఆలోచనలతో సన్నివేశాలు తీయలేదు కదా?, అసలు నిజంగానే గీతూ మోహన్ దాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించిందా? అనే సందేహాలు కలిగించే రేంజ్ లో ఆమె టేకింగ్ ఉంది అంటేనే అర్థం చేసువుకోవచ్చు, ఈ చిత్రం యాక్షన్ మూవీ లవర్స్ కి ఒక విజువల్ ఫీస్ట్ లాగా ఉండబోతుంది అనేది.
