https://oktelugu.com/

Bigg Boss Sohel : బిగ్ బాస్ సోహెల్ కి అమ్మాయిల టార్చర్… పోలీసులకు చెబితే రియాక్షన్ ఇదంటూ ఆవేదన!

అమ్మాయిల వల్ల మోసపోయిన వారికి, వారి వల్ల టార్చర్ కి గురి అవుతున్న వారికి అండగా ఉంటాను అంటూ సోహెల్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. రీసెంట్ గా బూట్ కట్ బాలరాజు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రం మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది.

Written By:
  • NARESH
  • , Updated On : March 1, 2024 8:29 pm
    Follow us on

    Bigg Boss Sohel : బిగ్ బాస్ ఫేమ్ సోహెల్ ని అమ్మాయిలు టార్చర్ చేస్తున్నారట. ఫోన్ చేసి గలీజ్ గా మాట్లాడుతున్నారట. ఈ సమాజంలో మగవారికి రక్షణ లేదు, న్యాయం లేదని సంచలన వ్యాఖ్యలు చేశాడు. బిగ్ బాస్ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సోహెల్. ఈ రియాలిటీ షోతో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. షో నుండి బయటకు వచ్చిన తర్వాత వరుస సినిమాలు చేస్తూ కెఅదృష్టం పరీక్షించుకుంటున్నాడు. కాగా ఈ మధ్య సోహెల్ ని కొంతమంది అమ్మాయిలు టార్చర్ చేస్తున్నారట. ఫోన్ చేసి అసభ్యంగా మాటాడుతున్నారట. ఒక అమ్మాయి అయితే ప్రతిరోజూ ఫోన్ చేసి చుక్కలు చూపిస్తుందట. ఫోన్ లిఫ్ట్ చేస్తే గలీజ్ గా మాట్లాడుతుందట.

    దాదాపు 11 మంది అమ్మాయిలు డైలీ ఫోన్ చేసి టార్చర్ చేస్తున్నారని, అందుకే టార్చర్ 1, టార్చర్ 2 అని నంబర్స్ సేవ్ చేసుకున్నాను అని సోహెల్ చెప్పాడు. ఒక అమ్మాయి ఐతే ఏకంగా ఇంటికి కూడా వస్తుందట. ఫోన్ చేసి అక్కడికి వెళ్దాం .. ఇక్కడికి వెళ్దాం అంటూ దారుణంగా మాట్లాడుతుందట. సోహెల్ వాళ్ళ అమ్మ ఆ అమ్మాయికి వార్నింగ్ ఇచ్చినప్పటికీ వినకపోవడంతో పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలని అనుకున్నాడట.

    ఆమె మీద కేసు పెడదామని అరియానా తో కలిసి పోలీస్ స్టేషన్ కి వెళ్తే .. కేసు పెడితే నీకే ఇబ్బంది అవుతుందని పోలీసులు తెలిపారట. దీంతో చేసేదేంలేక సైలెంట్ గా ఉన్నాడట. కాగా పోలీసులు చెప్పిన మాటలకు షాక్ అయ్యాను .. అదే ఒక అబ్బాయి ఇలా అమ్మాయి ఇంటికి వెళ్లి రచ్చ చేస్తే పోలీసులు ఊరుకుంటారా. లోపలేసి నాలుగు తగిలిస్తారు. అమ్మాయిలకు ఒక న్యాయం .. అబ్బాయిలకు ఒక న్యాయం ఉంటుందా అనిపిస్తుంది అంటూ ఆవేదన చెందాడు.

    పైగా ఇవన్నీ చూశాక అమ్మాయిల వల్ల మోసపోయిన వారికి అండగా ఉండాలని ఉంది. మగవారి సంఘానికి లీడర్ గా ఉంటాను. అమ్మాయిల వల్ల మోసపోయిన వారికి, వారి వల్ల టార్చర్ కి గురి అవుతున్న వారికి అండగా ఉంటాను అంటూ సోహెల్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. రీసెంట్ గా బూట్ కట్ బాలరాజు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రం మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది.