Homeఎంటర్టైన్మెంట్Balakrishna Koratala Siva Movie Updates: బాలకృష్ణ - కొరటాల శివ మూవీలో విలన్ గా...

Balakrishna Koratala Siva Movie Updates: బాలకృష్ణ – కొరటాల శివ మూవీలో విలన్ గా టాప్ హీరో.. ఇది కదా అసలు సిసలు కాంబినేషన్ అంటే..

Balakrishna Koratala Siva Movie Updates: ప్రస్తుతం సీనియర్ హీరోల్లో నందమూరి బాలకృష్ణ ఊపు ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ‘అఖండ’ నుండి ‘డాకు మహారాజ్’ చిత్రం వరకు వరుస బ్లాక్ బస్టర్స్ తో అభిమానులను ఆనందంతో ఉక్కిరిబిక్కిరి చేసిన ఈ నందమూరి సింహం , రీసెంట్ గా ‘అఖండ 2’ తో కాస్త తడబడిన సంగతి అందరికీ తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ గా మిగిలింది. ఈ రేంజ్ ఫ్లాప్ అవుతుందని అభిమానులు కూడా ఊహించలేకపోయారు. ఈ సినిమా తర్వాత బాలయ్య స్క్రిప్ట్ సెలక్షన్ విషయం లో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ప్రస్తుతానికి ఆయన గోపీచంద్ మలినేని దర్శకత్వం లో ఒక సినిమా చేస్తున్నాడు. రీసెంట్ గానే షూటింగ్ కార్యక్రమాలను మొదలుపెట్టుకున్న ఈ చిత్రంలో మంచు మనోజ్ విలన్ గా నటిస్తున్నాడు.

తమన్ సంగీతం అందిస్తుండగా , ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ని త్వరలోనే విడుదల చేయబోతున్నారు మేకర్స్. ఈ సినిమా సంగతి పక్కన పెడితే రీసెంట్ గానే బాలయ్య బాబు కొరటాల శివ దర్శకత్వం లో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు అనిరుద్ మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నాడు. త్వరలోనే షూటింగ్ మొదలు పెట్టుకోనున్న ఈ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ఈ చిత్రం లో విలన్ గా నటించబోతున్నది మరెవరో కాదు , సీనియర్ హీరో రాజశేఖర్. ఒకప్పుడు రాజశేఖర్ కి ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. బాలకృష్ణ తో సమానమైన క్రేజ్ , ఫాలోయింగ్ ఉండేది. కానీ మధ్యలో వరుస ఫ్లాప్స్ కారణంగా ఆయన మార్కెట్ బాగా దెబ్బ తినింది.

అయినప్పటికీ హీరో గా కొన్ని సినిమాలు చేసాడు రాజశేఖర్, అవి కూడా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు , దీంతో క్యారెక్టర్ రోల్స్ , విలన్ రోల్స్ చేయడానికి ఆయన సిద్దమయ్యాడు. అందులో భాగంగానే ఆయన ఈ ఏడాది ‘బైకర్’ చిత్రం లో నటించాడు. ఇందులో శర్వానంద్ కి తండ్రి పాత్రలో , పాజిటివ్ క్యారెక్టర్ లో బలమైన ఎమోషన్స్ పండించాడు. ఈ చిత్రం తర్వాత ఆయన విజయ్ దేవరకొండ హీరో గా నటిస్తున్న ‘రౌడీ జనార్ధన’ అనే చిత్రం లో పవర్ ఫుల్ విలన్ క్యారెక్టర్ చేయడానికి ఒప్పుకున్నాడు. ఇప్పుడు లేటెస్ట్ గా ఆయన బాలయ్య , కొరటాల శివ కాంబినేషన్ లో విలన్ గా నటించబోతున్నాడు. ఒకప్పుడు బాలయ్య తో సమానంగా వసూళ్లను రాబడుతూ టాప్ 5 హీరోలలో ఒకరిగా కొనసాగిన రాజశేఖర్ , ఇప్పుడు అదే బాలయ్య సినిమాలో విలన్ గా నటించబోతుండడం గమనార్హం. చూడాలి మరి ఈ కాంబినేషన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి అద్భుతాలు సృష్టించబోతోంది అనేది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version