Guntur Kaaram: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మహేష్ బాబు అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ దాకా అందరికీ చాలా ఇష్టం ఉంటుంది.ఎందుకంటే ఆయన చేసిన సినిమాలు అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాయి కాబట్టి ఆయన చేసిన సినిమాలు మంచి విజయాన్ని సాధించడంతో పాటు ఎక్కువ ప్రేక్షకాదరణ కూడా పొందుతాయి.
ఆయన చేసిన అతడు, పోకిరి, బిజినెస్ మేన్ , ఖలేజా లాంటి సినిమాలు ఇప్పటికీ టీవీలో వస్తే మిస్ అవ్వకుండా చూసే జనాలు చాలా మంది ఉన్నారు. ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే అందమైన హీరోలలో మహేష్ బాబు నెంబర్ వన్ స్థానం లో ఉంటాడు.రోజు రోజుకీ మహేష్ బాబు అందం పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. ఆయనొక్కడి విషయంలోనే ఏజ్ అనేది జస్ట్ నెంబర్ మాత్రమే అనేది ఆయన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. 50 సంవత్సరాలకి దగ్గరలో ఉన్నా కూడా ఇప్పటికీ పాతికేళ్ల కుర్రాడిలా చాలా యవ్వనంగా, చాలా అందంగా కనిపిస్తూ ఉంటాడు మహేష్ బాబు ఆయన మెయింటెనెన్స్ ఆ విధం గా ఉంటుంది. ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ డైరెక్షన్ లో గుంటురు కారం అనే సినిమా చేస్తున్నాడు ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి చాలా అడ్డంకులు ఎదుర్కొంటూ వస్తుంది. ఇప్పటికే ఈ సినిమా పూర్తయిపోయి రిలీజ్ కూడా అవ్వాల్సింది. కానీ మధ్య మధ్యలో వచ్చిన డిస్టబెన్స్ ల వల్ల లేట్ అవుతూ వస్తుంది. ఇక ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం ఒక న్యూస్ నెట్లో తెగ హల్చల్ చేస్తుంది. అది ఏంటి అంటే ఈ సినిమాలో మరో హీరో ఒక కీలక పాత్ర లో కనిపించబోతున్నాడు అని స్పష్టంగా తెలుస్తుంది. ఆ హీరో ఎవరు అంటే బాలీవుడ్ బాద్షా అయినా షారుక్ ఖాన్ అని తెలుస్తుంది.
ఇక షారుక్ ఖాన్ రీసెంట్ గా జవాన్ అనే సినిమాతో వచ్చి బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ డూపర్ హిట్ కొట్టాడు. దాంతో మళ్లీ అతను సక్సెస్ ట్రాక్ ఎక్కాడు అయితే ఈ సినిమా చివర్లో వచ్చే పది నిమిషాల ఎపిసోడ్ కోసం షారుక్ ఖాన్ నటిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇంతకుముందే షారుఖాన్ కి ఈ కథ చెప్పడం ఆయన ఓకే అనడం కూడా జరిగిందట ఇక జవాన్ సినిమా రిలీజ్ టైం లో మహేష్ బాబు కూడా తన ట్విట్టర్ వేదికగా ఆ సినిమా గురించి మాట్లాడటం ఈ న్యూస్ కి ఇంకా బలాన్ని చేకూరుస్తుంది. అయితే ఈ క్యారెక్టర్ అనేది సస్పెన్స్ గా ఉంచి తర్వాత ఒకేసారి రీవిల్ చేయాలనే ఉద్దేశ్యంలో చిత్ర యూనిట్ ఉన్నట్టుగా తెలుస్తుంది. అందుకే ఆయన క్యారెక్టర్ కి సంబంధించిన విషయాలను బయటకి రాకుండా సినిమా యూనిట్ జాగ్రత్త పడుతుంది.ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీలీల చేస్తుంది.ఇక సెకండ్ హీరోయిన్ గా మీనాక్షి చౌదరి నటిస్తుంది.
మొదట ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే ని తీసుకున్నప్పటికీ కొన్ని డిస్టబెన్స్ ల వల్ల పూజ హెగ్డే ని తప్పించి ఆమె ప్లేస్ లో శ్రీలీలా ని హీరోయిన్ గా తీసుకోవడం జరిగింది. ఈ సినిమా మొదలైనప్పటి నుంచి ఈ సినిమాకి ఏదో ఒక రకమైన అడ్డంకి మాత్రం వస్తూనే ఉంది లేకపోతే ఈ సినిమా ఇప్పటికే ఎప్పుడో షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకుని రిలీజ్ అవ్వాల్సింది.ఇక గుంటూరు కారం సినిమాని తెలుగు ,తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో రిలీజ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఇక మహేష్ బాబు కి సంబంధించి మొదటి పాన్ ఇండియా సినిమా ఇదే కావడం విశేషం… అలాగే త్రివిక్రమ్ కి కూడా మొదటి పాన్ ఇండియా సినిమా ఇదే…